తాజాగా 'బాహుబలి'ని చూసి బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారని, ఎవరో ఒకరిద్దరు శేఖర్‌కపూర్ వంటి వారు ఆ చిత్రాన్ని మెచ్చుకున్నారే గానీ.. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్‌తో పాటు పలువురు బాలీవుడ్ దర్శకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే వార్త సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది నిజమే. స్వయాన కరణ్‌జోహార్ వంటి వ్యక్తి ఈ చిత్రాన్ని విడుదల చేసినా ఆయన కాంపౌండ్‌కు చెందిన వారు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారనే వాదన వినిపిస్తోంది.
ఇక 'బాహుబలి'ని పొగడకపోయినా ఫర్వాలేదు.. కానీ కమాల్‌ఖాన్‌లా వెగటుగా మాట్లాడటం కాకుండా కనీసం తప్పొప్పులను ఎత్తి చూపుతూనే ఆ చిత్రం గురించి విశ్లేషణ చేయడంలేదు..? ఇక మనం బాలీవుడ్ వారిని అంటున్నాం కానీ, టాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన కొందరు ప్రముఖులే మాట్లాడారు కానీ సీనియర్ దర్శకదిగ్గజాలుగా పిలువబడే వారు ఎవ్వరూ ఇక్కడ కూడా ఎంతో మంది మౌనంగా ఉంటున్నారు. మరి ఈ మౌనానికి కారణం ఏమిటి? సినిమా గొప్పతనాన్ని చూసి ఓర్వలేకపోతున్నారా? లేక అదేమంత గొప్ప సినిమా కాదని భావిస్తున్నారా? అనేది అర్ధం కాని విషయం.