ఉత్తరప్రదేశ్..దేశంలోనే కీలకమైన రాష్ట్రం. ఎప్పటినుంచో యాదవులు, మరికొందరి ఏలుబడిలో అది విలవిలలాడుతోంది. అత్యంత పేదరికం, రౌడీయిజం, మతాల గొడవలు, పెద్ద రాష్ట్రం కావడంతో పరిపాలనా వ్యవహారాలు ఎవరికైనా కష్టంగానే మారుతున్నాయి. కానీ కొద్దినెలల కిందట ఎన్నికల్లో బిజెపి విజయబావుటా ఎగురవేసి, అనూహ్యంగా రాజ్‌నాథ్‌సింగ్‌ని కూడా కాదని యోగి ఆదిత్యానాథ్‌కి సీఎం పదవి కట్టబెట్టారు. ఇక అక్కడి నుండి ఆయన రాష్ట్రంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాడు. విమర్శలకు భయపడటం లేదు. తాననుకున్న మంచిని చేసి చూపిస్తున్నాడు. కుల ఆధిపత్యాలకు చెక్ పెట్టాడు. భారీగా అవినీతి అధికారులను పక్కనపెట్టాడు.
ఐఏయస్, ఐపిఎస్‌లకు పూర్తి స్వేచ్చనిచ్చి, పదవి దుర్వినియోగంచేస్తే మాత్రం కటాకటాల వెనుకే ఉండాల్సివస్తుందని హెచ్చరించి, భారీగా బదిలీలు చేశాడు. గోసంరక్షణకు నడుం బిగించాడు. బొట్టు పెట్టి.. పూజ చేసి.. గడ్డి మేపి, పాలు తాగి, ఒట్టిపోతే..గోవు మాతే కోతకోత..లకు స్పందించి, ఇక నుంచి గోవులను అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వ పర్మిషన్ కంపల్సరీ చేశాడు. గోకళేబరాలను మూయించాడు. అమ్మ జయలలిత ప్రవేశపెట్టిన 'అమ్మ క్యాంటీన్ల'ను గురించి తెలుసుకుని కేవలం మూడే మూడు నెలల వ్యవధిలో వాటిని అన్నపూర్ణ భోజనాలయ్‌ల పేరుతో ప్రారంభించాడు.
కానీ చంద్రబాబు వంటి నాయకులు పదవినెక్కి మూడేళ్లు దాటుతున్నా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయలేకపోయారు. అమరావతిలోని సచివాలయం దగ్గర ఓ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి కూడా సచివాలయం క్యాంటీన్‌కు రాబడి తగ్గుతోందని దానిని మూసివేశాడు. కానీ చంద్రబాబులాగా యోగి విజన్ 2050 అంటూ ప్రగల్భాలు పలకడం లేదు. ఒక్క ఏడాదిలోనే ఎంతో మార్పు తీసుకుని వస్తానని హామీ ఇస్తున్నాడు. మహిళల రక్షణకు ప్రత్యేక యాంటీ ర్యాంగింగ్ స్కాడ్‌లను ఏర్పాటు చేశాడు. ట్రిపుల్ తలాక్‌పై కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలో బిసి, ఎస్సీ, ఎస్టీ కోటాలను రద్దు చేసి, మెరిట్ ఆధారంగా మాత్రమే సీట్లు ఇవ్వాలని ఆదేశించాడు. కావాలంటే ప్రభుత్వం తరపున ప్రత్యేకకోచింగ్‌ను ఉచితంగా ఇస్తామని, కానీ రిజర్వేషన్ కోటాలు వద్దన్నాడు. యోగీ ఈజ్ సూపర్.. అండ్ ది బెస్ట్...!