తెల్లవారు, నల్లవారు అనే వర్ణ వివక్ష ప్రపంచంలోనే కాదు.. భిన్న జాతులు, సంప్రదాయాలుండే ఇండియాలో కూడా ఉందని ఇటీవల ఓ బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యలతో నిరూపితమైంది. ఇక భారతదేశంలో ఉత్తరాది వారు తెల్లగా, దక్షిణాది వారు కాస్త నల్లగా, ఈశాన్య రాష్ట్రాల వారు చైనీస్‌లా ఉంటారనేది వాస్తవం. కాగా ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో తెల్లగా మారడానికి ఫెయిర్‌నెస్ క్రీమ్‌లని మార్కెట్‌లోకి తెచ్చి, నల్లగా ఉంటే అందవి హీనులని, తెల్లతోలు వున్న వారే అందమైన వారనే భ్రమను కల్పిస్తూ ఆత్మనూనత్యకు గురి చేసి తమ ప్రొడక్స్స్‌ను అమ్ముకుంటున్నాయి కొన్ని విదేశీ వ్యాపార సంస్థలు.
వీటిలో షారుఖ్‌ఖాన్ నుంచి పలువురు క్రికెటర్లు కూడా నటిస్తున్నారు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ బాలీవుడ్ యంగ్‌స్టార్ తనకి వచ్చిన ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనకు నో చెప్పి వార్తల్లో నిలిచాడు. కోట్లు వద్దనుకున్నాడు. ఇక ఉత్తరాదిని ఏలిన రాణిముఖర్జీ, కాజోల్‌ల నుంచి దక్షిణాది నుంచి వెళ్లిన దీపికాపడుకొనే, దేశ సూపర్‌స్టార్ రజనీకాంత్, నాటి దక్షిణాది నటీమణులైన వాణిశ్రీ, జయసుధ, రాధిక, వాణివిశ్వనాథ్, రోజా.. వంటి వారందరూ నలుపే కదా..!
తాజాగా శృతిహాసన్‌కి కూడా ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్ అంబాసిడర్ అవకాశం వచ్చినా నో అని చెప్పింది. ఇక మద్యానికి కూడా తాను ఎంతిచ్చినా యాడ్స్ చేయనని, ఇది తనకు తాను పెట్టుకున్న నియమమని శృతి తేల్చిచెప్పింది. ఇది మంచి నిర్ణయం..!