ఇదేదో బన్నీ సినిమా టైటిల్ అనుకునేరు.. నిజమే.. ఈ టైటిల్‌తో బన్నీ ఓ దేశభక్తి చిత్రం చేస్తూ ఉండవచ్చు. కానీ ఈ మాట అంటోంది తమిళ స్టార్..తెలుగులో కూడా ఆ స్టేటస్ ఉన్న హీరో సూర్య గురించి. కాగా సూర్య పెద్దగా పబ్లిసిటీ లేకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు.ఆయన ఓ ఫౌండేషన్‌ని స్థాపించి.. అనాధ పిల్లలకు చదువు సంద్యల నుండి అన్నీ ఆయనే చూస్తున్నాడు. ఇక తాజాగా సూర్య ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
తాము ఉంటున్న ఇంటిని తన ఫౌండేషన్‌లోని పిల్లలకు హాస్టల్‌గా వాడేందుకు రాసిఇచ్చాడు. ఈ ఇల్లు కొన్నికోట్లఖరీదు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇంటిని సూర్య తండ్రి కట్టించాడు. సూర్య,కార్తి పెరిగింది.. పెళ్లిళ్లు చేసుకుంది.. పిల్లలకు జన్మనిచ్చింది కూడా ఈ ఇంటిలోనే. ఈ ఇళ్లంటే సూర్య తండ్రికి చాలాసెంటిమెంట్ ఉంది. దశాబ్దాలుగా వారు ఆ ఇంటిలోనే ఉమ్మడిగా ఉంటున్నారు. కుటుంబసభ్యులు ఎక్కువ కావడంతో ఈ ఇల్లు ఇరుకుగా మారిందట. అందుకే తమ కుటుంబసభ్యులందరికీ సరిపడేలా కొత్తగా ఓ ఇంటిని కట్టించి, అందులోకి మారుతున్నారు. దీంతో ఈ ఇంటిని అమ్మమని ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా సూర్య తిరస్కరించి, ఆ ఇంటిని తన ఫౌండేషన్‌కి రాసిచ్చాడు.
ఇక ప్రస్తుతం సూర్య, కార్తి ఇద్దరు ఫ్లాప్‌ల్లో ఉన్నారు. నిర్మాతలుగా కూడా బాగా నష్టాలు వచ్చాయి. అయినా సూర్య,కార్తిలు మాత్రం ఈ ఫౌండేషన్ కోసం కోట్లు కేటాయిస్తున్నారు. హుధ్‌హుద్ తుఫాన్ సమయంలో కూడా సూర్య తన ఫ్యామిలీ తరపున భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.