'బాహుబలి' విషయంలో మోదీ చాకచక్యంగా వ్యవహరించాడని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి చెప్పిన మాటల్లో చాలా లాజిక్కు ఉంది. నేడు జాతీయ సినిమా అంటే ఖాన్ త్రయమే ఏలుతోంది. రాజేష్‌ఖన్నా, అమితాబ్ బచ్చన్‌ల తర్వాత ఖాన్‌లదే రాజ్యం. సల్మాన్ వంటి వారు మోదీకి మద్దతు తెలిపినా కూడా ఆయనకు వారిపై పెద్దనమ్మకం లేదు. కానీ మోదీ మాటల మనిషి కాదు... మౌనంగా ఉంటూనే చాపకింద నీరు తెచ్చేరకం. సినిమా గ్లామర్ అనేది అత్యంత ప్రజాదరణ ఉన్న విభాగమని, భవిష్యత్తులో కూడా వారి మైలేజ్ తనకు చాలా అవసరమని మోదీ భావించి ఉంటాడనే విశ్లేషణలు వస్తున్నాయి.
అమితాబ్‌తో ఆయన బాగా సఖ్యతగా ఉంటాడు. గుజరాత్‌కి సీఎంగా ఉన్నప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్నాడు. బాలీవుడ్‌లో ఖాన్ త్రయానికి చేరువలో హృతిక్‌రోషన్‌తో పాటు అక్షయ్‌కుమార్ వంటి వారు కూడా లేరు. సో.. మోదీ బాహుబలి క్రేజ్‌ను క్యాష్ చేసుకున్నాడని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయన బాహుబలి, కట్టప్పల గురించి మాట్లాడాడంటున్నారు. ఇక మోదీ ఎప్పటి నుంచో రజనీపై కన్నేశాడు. కానీ రజనీ వయసు మీరిన వ్యక్తి. సో.. ఒకప్పటి బిజెపి కేంద్రమంత్రి అయిన కృష్ణంరాజు ద్వారా ప్రభాస్‌ని, చివరకు పెట్టుబడి పెట్టేందుకు రామోజీని కూడా తెరపైకి తెచ్చాడంటున్నారు.
ఒక సౌత్ ఇండియా సినిమా పట్ల ఆయన అంత జాగ్రత్తలు తీసుకున్నాడని, త్వరలో కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇవ్వనున్నాడని, రజనీని సైతం రాష్ట్రపతి లిస్ట్‌లో ఉంచాడని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి భవిష్యత్తులో రజనీ, ప్రభాస్, విజయ్ వంటి వారు బిజెపికి తురుపుముక్కలు అయి, సినిమా ప్రభావం ఎక్కువగా ఉండే తమిళనాడు, తెలుగురాష్ట్రాలలో బిజెపిని పటిష్టపరిచే వ్యూహం ఇదేనని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ఎవరేమనుకున్నా ఇందులో కాస్త లాజిక్ ఖచ్చితంగా ఉందని తెలుస్తోంది.