పవన్‌ది భిన్నమైన వ్యవహారశైలి.. రాజకీయాల్లో అయినా, సినిమాలలో అయినా అంతే. డాలీతో తెలుగులో డబ్ అయిన 'వీరం'ను 'కాటమరాయుడు'గా డాలీతో సినిమా చేశాడు. ప్రస్తుతం తన స్నేహితుడు త్రివిక్రమ్‌తో మూవీ చేస్తున్నాడు. 'కాటమరాయుడు' ఇచ్చిన షాక్‌తోనైనా పవన్ తన తదుపరి చిత్రాన్ని నీసన్ దర్శకత్వంలో చేయడం మానుకుంటాడని పలువురు భావించారు. మహేష్-కొరటాల మూవీ అయిపోగానే కొరటాల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి. కొరటాల కూడా పవన్ కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీని, మంచి సందేశాత్మక సబ్జెక్ట్‌ను చెప్పాడట. కథ పవన్‌కి నచ్చినా కూడా ఆ చిత్రం చేసే అవకాశాలు ఇప్పుడే లేవంటున్నారు.
త్రివిక్రమ్ తదుపరి ఆయన ఎ.యం.రత్నం నిర్మాతగా, నీసన్ దర్శకత్వంలోనే 'వేదాళం'ను రీమేక్ చేయడానికే అంగీకరించాడట. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యే సరికి ఎన్నికల సమయం దగ్గర పడుతుందని, కాబట్టి చేయాలని ఉన్నా కొరటాలతో సినిమా చేసే అవకాశాలు లేవంటున్నారు. కొరటాల కోసం కనీసం నీసన్‌ని పక్కనపెట్టవచ్చు కదా...! అని కొందరు అంటుంటే, నీసన్ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. 'సత్యాగ్రహి' ఆగిపోయింది. సో.. రత్నంకే అదీ మాట ప్రకారం నీసన్‌తోనే చిత్రం ఖాయమంటున్నారు. ఆయనకు కాస్త తిక్క.. దానికి ఓ లెక్క ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది.