ఒకప్పుడు కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని భావించేవారు. కానీ 'బాహుబలి' తర్వాత మాత్రం జక్కన్నతో ఒకే ఒక్క చిత్రం చేసినా చాలని అనుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం సీనియర్ స్టార్స్‌తో చిత్రాలు చేసే ఉద్దేశ్యంలో లేడని అర్దమవుతోంది. దానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలను కూడా గతంలోనే ఆయన ఇచ్చారు. సీనియర్లు అంటే దర్శకత్వంలో, ఇతర విషయాలలో వేలు పెట్టకుండా ఉండరు.
కానీ సినిమానే శ్వాసగా, విజన్ ఉన్న స్పష్టమైన అవగాహన ఉన్న దర్శకుడు కావడంతో ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత జక్కన్న ఓ మూడు నెలలు విశ్రాంతి తీసుకోనున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ టూర్‌లో ఉన్నాడు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటనే దానిపై పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. గతంలో జక్కన్న తాను కె.ఎల్.నారాయణకి చెందిన దుర్గాఆర్ట్స్‌లో మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయాలని చెప్పాడు.
కానీ మహేష్ డైరీ చూస్తే ఇప్పుడు అది వీలు పడేలా లేదు. ఇక బన్నీతో జక్కన్న ఓ చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. గతంలోనే తన బేనర్‌లో ఓ చిత్రం చేయమని దానయ్య రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చాడని, ఆ చిత్రాన్ని బన్నీ హీరోగా రూపొందిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'ఈగ2'ను నానితో చేస్తాడని కొందరు అంటున్నారు. కాదు బాలీవుడ్, హాలీవుడ్ అనే వార్తలతో పాటు రజనీ హీరోగా ఓ చిత్రం చేస్తాడని.. ఇలా పలు చిత్ర విచిత్రమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఇక 'మగధీర' తర్వాత సునీల్‌తో 'మర్యాదరామన్న' తరహాలో ఓ చిన్న చిత్రం చేస్తాడని అంటున్నారు. జక్కన్నేమో గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లు లేని చిత్రాన్ని తీయాలని ఉందని తెలిపాడు. కాబట్టి 'ఈగ2' చేసే అవకాశాలు తక్కువే. మొత్తానికి జక్కన్న నోరు విప్పేదాకా అంతా సస్పెన్సే...!