ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ajith and Siva Hat-Trick Combination Film

అజిత్, శివ సంచలనానికి రెడీ అవుతున్నారు..!

Ajith and Siva Hat-Trick Combination Film

మేడే రోజున తమిళ దైవం, రజనీ తర్వాత అంతటి వీరాభిమానులున్న అజిత్‌ పుట్టినరోజు. ఓ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక ఆయనంటే ప్రాణమిచ్చే ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. మరోపక్క శివకు మంచి మాస్‌ దర్శకునిగా పేరుంది. ఇప్పటికే అజిత్‌-శివల కాంబినేషన్‌లో రెండు సూపర్‌హిట్‌ చిత్రాలు వచ్చాయి. 'వీరం, వేదాళం'లతో ఈ కాంబినేషన్‌కి భలే డిమాండ్‌ ఏర్పడింది. ఈ రెండు పక్కా మాస్‌ చిత్రాలే. 

ఇక వీరిద్దరు హ్యాట్రిక్‌ చిత్రం ప్రారంభించడంతో ఇది కూడా పక్కా మాస్‌ చిత్రమని అందరూ భావించారు. అదే 'వివేగం'. కాగా ఇప్పటివరకు విడుదలైన ఈ చిత్రం స్టిల్స్‌, అజిత్‌ సిక్స్‌ప్యాక్‌ చూస్తుంటే ఇది కాస్త వైవిధ్యమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ అనిపిస్తోంది. తాజాగా అజిత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం కొత్త స్టిల్‌ విడుదలైంది. ఇందులో అజిత్‌ మంచులో కర్రదుంగను మోస్తున్నాడు. దీంతో ఈ చిత్రం విజువల్‌గా కూడా వండర్‌గా ఉంటుందనే అభిప్రాయం కలుగుతోంది. ఇందులో అజిత్‌ దేశవిదేశాలు తిరిగే ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 

దానికి తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఇప్పటికి ఏ భారతీయ చిత్రం తీయనన్ని దేశాల్లో అంటే 12కి మించిన దేశాలల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అక్షరహాసన్‌ కీలకమైన పాత్రను చేస్తోంది. ఈ 'వివేగం' చిత్రం ఎన్ని సంచలనాలకు కేంద్రబిందువు కానుందో..? పవన్‌ దృష్టిని ఆకర్షిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Ajith and Siva combination has two super hit films. The combination of 'Veeram and Vedhalam' These two mass pictures. Now that they have started a hat trick movie, it is also a mass film. That's the 'Vivegam'.

tamil hero ajith
director siva
vivegam movie
ajith birthday
pawan kalyan
vivegam new poster