జక్కన్నకు సాహో అంటున్నారు..!

'బాహుబలి-ది బిగినింగ్' రిలీజ్ అయినప్పుడు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కానీ కాస్త ఆనుమానం ప్రజల్లో ఉండేది. ఇక ఇతర భాషల్లో పెద్దగా అంచనాలు లేవు. రాజమౌళి సత్తా తెలిసిన టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రంతో రాజమౌళి ఏదో సంచలనం సృష్టించడం ఖాయమని భావించారు. అనుకున్నదే జరిగింది. ఏమని వర్ణించనూ.. అనే తరహాలో ప్రభంజనం సృష్టించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కీర్తిపతాకాన్ని ఎగురవేసింది.
దాంతో 'బాహుబలి-ది కన్‌క్లూజన్' విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే దేశవ్యాప్తంగా ఎన్నో ఆశలు రేకెత్తించింది. కానీ కొందరు మాత్రం రాజమౌళిని తేలిగ్గా తీసిపారేశారు. అయితే ఈ సెకండ్ పార్ట్ విడుదలైన వెంటనే ప్రపంచం యావత్తు 'బాహుబలి' మేనియాలో పడిపోయారు. తనదైన ఎమోషన్స్‌ని పీక్స్‌కి చూపిస్తూ, ఇంటర్వెల్ బ్యాంగ్‌ను ఇరగదీసిన రాజమౌళికి ఇప్పుడు దేశ, విదేశాలలోని ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.
ఓ డబ్బింగ్ చిత్రం ఈ విధంగా కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా స్వైర విహారం చేస్తోంది. సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు కనీసం 20 రాష్ట్రాలకు పైగానే రిలీజ్ అవుతాయి. కానీ ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్థాయిలో రికార్డులు బద్దలు చేయడం కనివినీ ఎరుగని సంగతి. ఇక చిత్రంలోని చిన్న చిన్న లోపాలను పక్కనపెడితే, హిందీ చిత్రాలకే సాధ్యంకాని 1000కోట్ల మార్కును 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం సాధించడం ఖాయమైపోయింది. కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 600కోట్ల దాకా వసూలు చేసింది. సాహో.. జక్కన్న...!
'Baahubali The Beging' Releasing day More expectations on Film. But 'Baahubali The Conclusion' film situation totally changed different. After releasing movie total country peoples fall down and impressing in baahubali 2 movie because this peoples says Rajamouli is a one of the great director.
Rajamouli is a Great Director in Tollywood







































