Advertisementt

అనుష్క కేమైంది..!

Tue 02nd May 2017 07:04 PM
anushka shetty,devasena,baahubali movie,anushka personal staff,heroine anushka  అనుష్క కేమైంది..!
Anushka Shetty Removes her Personal Staff అనుష్క కేమైంది..!
Advertisement
Ads by CJ

అనుష్క ఇండస్ట్రీలోకొచ్చిన అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా టాప్ ప్లేస్ కి చేరుకుంది. ఒక పక్కన స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ సూపర్ హిట్స్ కొడుతూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. బాహుబలి బిగినింగ్ లో డీ గ్లామర్ గా కనిపించిన అనుష్క మధ్యలో చేసిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన బాహుబలి ద కంక్లూజన్ లో అనుష్క నటనకి, అందానికి ఫుల్ మార్కులు పడుతున్నాయి. 

సైజు జీరో కోసం పెంచిన సైజు వలన బాహబలిలో కాస్త లావుగానే కనబడిన అనుష్క వేసుకున్న దుస్తులతో, ఆభరణాలతో బాగానే కవర్ చేసింది. ఇక ఇప్పుడు బాహుబలి 2  విజయాన్ని అనుష్క పెద్దగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనబడం లేదు.ఎందుకంటే అనుష్క దగ్గర ఎంతోకాలం నుండి పని చేస్తున్న కొంతమంది వ్యక్తిగత సిబ్బందిని ఆమె విధుల నుండి తొలిగించినట్లు చెబుతున్నారు. కారణాలు తెలియవుగాని నలుగురు ఉద్యోగుల్ని అముష్క ఒకేసారి పనిలోనుండి తీసేసినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. మరి అనుష్క వారి స్థానంలోకి కొత్త స్టాఫ్ ని తీసుకుంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి.

మరి ప్రపంచమంతా బాహుబలి విజయంతో ఊగిపోతుంటే అనుష్క మాత్రం ఇలా స్టాఫ్ ని తొలిగించే పనుల్లో బిజీగా ఉందనే గుసగుసలు వినబడుతున్నాయి. మరోపక్క అనుష్క సీక్రెట్ ని ఒకటి ఆ నలుగురు నుంచి బయటికి తెలియడం వలెనే అనుష్క వారికి హూస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిందని అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్దమో అనుష్క స్పందిస్తేనే బావుంటుంది.

Anushka Shetty Removes her Personal Staff:

There is an interesting gossip doing rounds in the film circles that Heroine Anushka Shetty has fired her personal staff.. and she has relieved four of them from duties from May 1.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ