రైతులు, సైనికులు లేనిదే ప్రపంచం లేదు. కానీ నాటి 'జై... జవాన్.. జై...కిసాన్' అన్న నినాదాన్ని మర్చిపోతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల గురించి మాట్లాడే నాయకులు, పదవుల్లోకి వచ్చి అధికారం చేపట్టగానే ఆ స్థితిని, తమ పరిస్థితిని మర్చిపోతున్నారు. నాడు కేంద్రంలో వాజ్‌పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయ దేశంలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలను గురించి మాట్లాడుతూ, రైతులకు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉండి మరీ వ్యవసాయం దండగ. రైతుల పిల్లలు ఐటీ చదుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. ఆయన భావం ఏమైనా కూడా ఆయన అలా మాట్లాడకూడదు. ఆ తర్వాత రైతుల దెబ్బేంటో రుచిచూశాడు.
తాజాగా మరో మంత్రి మాట్లాడుతూ, అందునా వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి జిల్లాలో మాట్లాడుతూ, రైతులకు ఇక వ్యవసాయం గిట్టుబాటు కాదనే తరహాలో వ్యాఖ్యానించాడు. మరి రైతులు లేకపోతే డబ్బులు తిని బతకాలా? లేక మరోదైనా తినాలా? అనే విజ్ఞత వారికి లేకపోవడం బాధాకరం. నిజంగా దున్నేవాడికే భూమి ఎప్పుడు వస్తుందో చూడాలి...! అది కేవలం కలగానే మిగిలిపోతోంది. అటు మోదీ, ఇటు చంద్రబాబు, కేసీఆర్‌లు కూడా రైతుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటే ఇంకేం చేయగలం...!