'బాహుబలి ద కంక్లూజన్' విడుదలైనప్పటినుండి డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల జల్లులో తడిచి ముద్దవుతున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ దగ్గరనుండి డైరెక్టర్స్ వరకు రాజమౌళి కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఎన్టీఆర్ తో మొదలైన ఈ ప్రశంసల పర్వం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరకు రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే వున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా విస్తరించిన రాజమౌళి హవా ని ప్రస్తుతానికి ఎవరూ టచ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఇక రాజమౌళికి మాత్రం భళి... భళిరా... రాజమౌళి అంటూ నీరాజనాలు అందజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ కూడా రాజమౌళి బాహుబలికి అభినందనలు తెలిపారు.
ఇక వీరి అభినందనలకు పేరు పేరునా థాంక్స్ చెప్పిన రాజమౌళి ఒక్కరి పొగడ్తకి మాత్రం పడిపోయారనే చెప్పాలి. అది సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన 'మై సెల్యూట్ టు గాడ్స్ ఓన్ ఛైల్డ్ రాజమౌళి అండ్ హీజ్ టీమ్' అనే ట్వీట్ కి పొంగిపోయిన రాజమౌళి ఆయనకు కృతజ్ఞతగా... మీరు చెప్పిన ఈ విషెస్ ని చూస్తుంటే 'దేవుడే దిగివచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టు ఉందని' రాజమౌళి ఉప్పొంగిపోతూ రీట్వీట్ చేసాడు. మరి ఈ ట్వీట్లు చూస్తుంటే రజినీకాంత్ - రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా? అయితే ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
బాహుబలి తర్వాత రజినీకాంత్ ని రాజమౌళి డైరెక్ట్ చేస్తాడని... అతిత్వరలోనే వీళ్ళ కాంబినేషన్లో మూవీ వుంటుందనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. కానీ రాజమౌళి నెక్స్ట్ హీరో అల్లు అర్జున్ అనే ప్రచారమూ వుంది. చూద్దాం రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరనేది.