వైసీపీ అధ్యక్షుడు జగన్ గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎవ్వరూ శుభిక్షంగా, సంతోషంగా లేరన్నారు. ఇక సీఎం చంద్రబాబు ఆర్టీసీని అమ్మేయడమో లేక మూసివేయడమో చేస్తాడని, దానిని తన పార్టీకి చెందిన జెసిదివాకర్‌రెడ్డికి (దివాకర్ ట్రావెల్స్) లేదా కేశినేని నానికి (కేశినేని ట్రావెల్స్) ఇస్తారని ఎద్దేవా చేశారు. మరోపక్క రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను మూసివేస్తున్నారని, వాటిని నారాయణ సంస్థల అధినేత, మంత్రి నారాయణకు ఇస్తారన్నాడు.
ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలను మూసివేసి సీఎం రమేష్‌కు గానీ, సుజనా చౌదరికీ గానీ కట్టబెడతారన్నాడు. మరోపక్క ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానన్న హామీని ఆయన నిలబెట్టుకోలేదని, రాష్ట్రంలోకి కార్మికులు అభధ్రతాభావంలో ఉన్నారన్నాడు. ఇవ్వన్నీ వాస్తవాలే అయినా.. ఇక్కడ ధర్మ సందేహం ఒకటున్నది. కనీసం సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ఆర్టీసిని ఇద్దరికీ, పాఠశాలలు, కళాశాలలను ఒకరికి, ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలను ఇద్దరికి ఇస్తాడని చెప్పాడు.
కానీ ఆయనే ముఖ్యమంత్రి అయితే మాత్రం తన తండ్రిలా అన్నింటిని తన కొడుకుకే కట్టబెట్టడమో కొడుకు లేకుంటే తన భార్యకు, లేదా బావకి కట్టబెట్టడమో చేస్తాడన్నది మాత్రం వాస్తవం. గురువింద గింజ సామెత అంటే ఇదే మరి...!