'బాహుబలి1, ఘాజీ'.. తాజాగా 'బాహుబలి-ది కన్‌క్లూజన్'తో దేశవ్యాప్తంగా ప్రభాస్, రాజమౌళిల తర్వాత రానా దగ్గుబాటి హీరోగా పేరు మారుమోగిపోతోంది. ఈ దగ్గుబాటి వారబ్బాయి గతేడాది ఓ టెలివిజన్ చానెల్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని చెప్పుకొచ్చాడు. నాకు పుట్టుకతో కుడికన్ను కనిపించదు. కేవలం ఎడమకన్నుతోనే చూస్తాను. ఎడమ కన్ను మూసుకుంటే నాకేమీ కనిపించదు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈకుడికన్ను ఓ వ్యక్తి మరణానంతరం నాకు పెట్టారు.
యువకునిగా ఉన్నప్పుడు ఎల్‌విప్రసాద్ ఐ హాస్పిటల్‌లో ఆ కన్నును నాకు అమర్చారు. ఆ సమయంలో కళ్లు లేని కొందరు చిన్నపిల్లలు బాధపడటం చూశాను. కన్ను లేకపోయినా ధైర్యంగా ఉండాలని చెప్పాను.. అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. కాగా ఆయన ప్రస్తుతం మంచి ఆర్ధికస్థోమత కలిగివున్నాడు కాబట్టి నేత్రదానాలపై అవగాహన పెంచడం, ఇలా కళ్లు లేక బాధపడుతున్న వారికి ఏదైనా చేయూతనిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? నీ కోసం ఓ వ్యక్తి కన్ను దానం చేసినప్పుడు తిరిగి నువ్వు అదే పని చేయకపోతే లావైపోతావు రానా...!