జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ గురించి, నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ తెలుగు దేశం నాయకుడు, వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అనుకున్నా ఆయన వాస్తవమే మాట్లాడారు. పవన్ మంచి వ్యక్తి... ప్రజలకు ఏదో చేయాలని భావించే మనిషి. కానీ ఆయన తాను రాజకీయాలలో పెట్టుబడి పెట్టలేనని, తాను వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదో కూడా తెలియదని చెబుతున్నాడని, కానీ రాజకీయాలలో ఇది పనికిరాదని, పాలిటిక్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండాలన్నారు.
పవన్ లోపల ఒకటి పెట్టుకుని, బయటకు ఒకటి మాట్లాడే వ్యక్తి కాదని, ఆయనేం అనుకుంటాడో అదే మాట్లాడుతాడని, కానీ ఆయన రాజకీయ వ్యూహకర్త మాత్రం కాదన్నారు. పవన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శించలేదని, ఏదైనా లోపాలు జరుగుతుంటే ఎత్తి చూపుతున్నారని, దాంతో సంబంధిత మంత్రులు, శాఖలు ఎలర్ట్ అవుతున్నాయన్నారు. ఇక నేటి రోజుల్లో మహాత్మాగాంధీ వచ్చి నేను మీకోసమే వచ్చాను. డబ్బు, బ్రాందీ పంచను అని చెప్పినా ఓడిపోతాడని ఆయన కుండబద్దలు కొట్టాడు. ఈ విషయంలో సోమిరెడ్డి నిజంగానే వాస్తవాలు మాట్లాడాడు. కావాలంటే జెపి, ఇరోం, అన్నాహజారే వంటి వారిని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.