ప్రపంచ కార్మిక, కర్షకుల దినం 'మేడే'ను పురస్కరించుకుని పవర్‌స్టార్, జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కుల,మత, జాతి, ప్రాంతీయబేధాలను మరిచి, ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగగా ఆయన మేడేను అభివర్ణించారు. ఇంట్లో నిత్యం కష్టపడే అమ్మ నుంచి దేశం కోసం అహర్నిశలూ సరిహద్దులలో కాపలా కాసే వీరజవాన్ల వరకు అందరూ జరుపుకునే పండుగ మేడే. మేడే అంటే శ్రమ శక్తికి తిరుగులేదని చాటే ఘనమైనరోజు. ప్రతినిత్యం కష్టపడే ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలి. వారి జీవితాలు సుఖమయం కావాలి. ప్రపంచంలోని శ్రామికులందకీ నా తరపున, జనసేన తరపున మేడే శుభాకాంక్షలు అంటూ తెలిపాడు పవన్‌కళ్యాణ్.
ఇక మేడేని ఆయన గుర్తు చేసుకోవడం అభినందనీయమే అయినా సినీ కార్మికుల కోసం కూడా ఆయన ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. మరోపక్క ఆయన మేడే శుభాకాంక్షలు తెలపడంతో ఎప్పుడు ఏ పుకారు వస్తుందా? అని ఎదురుచూసే కొందరు వచ్చే ఎన్నికల్లో పవన్ జనసేన వామపక్షాలతో కలసి సాగడానికి ఇది ఓ సంకేతమని విడ్డూర వ్యాఖ్యలు చేస్తున్నారు. కుల, మత. జాతి, ప్రాంతీయబేధాలు, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే మేడేకి కూడా రాజకీయ రంగు పులమడం కంటే భావదారిద్య్రం ఏముంటుంది కామ్రేడ్స్....!