Advertisementt

ప్రభాస్ కంటే ఎక్కువ పేరు వచ్చేసింది!

Mon 01st May 2017 06:38 PM
prabhas,ss rajamouli,baahubali2,rajamouli cutout,young rebel star prabhas  ప్రభాస్ కంటే ఎక్కువ పేరు వచ్చేసింది!
SS Rajamouli Craze after Baahubali ప్రభాస్ కంటే ఎక్కువ పేరు వచ్చేసింది!
Advertisement
Ads by CJ

రాజమౌళి పేరు ఇప్పుడు 'బాహుబలి' చిత్రంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది. అసలు బాహుబలి సినిమా తియ్యకముందే రాజమౌళికి 'మగధీర, ఈగ' చిత్రాలతో మంచి పేరొచ్చింది. ఇక బాహుబలితో ఇప్పుడు చరిత్రలో నిలిచిపోవడానికి రెడీ అయ్యాడు. అసలు ఏదైనా సినిమా వస్తే అందులో నటించిన హీరోలకే బాగా పేరొస్తుంది. కానీ రాజమౌళి తీసే చిత్రాలకు మాత్రం హీరో కంటే దర్శకుడు రాజమౌళి పేరే ఎక్కువ వినపడుతుంది. ఇకపోతే హీరోల మీద అభిమానంతో.. ఫ్యాన్స్, ఆయా హీరోల సినిమాలు విడుదలైనప్పుడు వారికి కటౌట్స్ పెట్టి, ఆ హీరోలను ఎంతగా ఆరాధిస్తున్నారో చెప్పకనే చెబుతారు. అంతేగాని అది తీసిన డైరెక్టర్ కు గాని అందులో నటించిన మరే ఇతర నటులకు గాని కటౌట్స్ పడవు.

కానీ 'బాహుబలి' చిత్రానికి మాత్రం అలా కాకుండా ప్రభాస్ కటౌట్స్ తోపాటు రాజమౌళి కటౌట్స్ కూడా థియేటర్స్ దగ్గర దర్శనమిచ్చాయంటే రాజమౌళికి ఉన్న రేంజ్... క్రేజ్ ఏమిటో అర్ధమవుతుంది. అసలు రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. అలా ఉంటుంది రాజమౌళి బ్రాండ్. ఇక ఇప్పుడు బాహుబలి విషయంలో ప్రభాస్ కి బాహుబలిగా నటించినందుకు ఎన్ని మార్కులు పడ్డాయో ఆ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళికి అంతకు మించి మార్కులు పడుతున్నాయి.

ప్రభాస్ బాహుబలిగా ఒక రారాజులా మెరిసిపోతుంటే రాజమౌళి మాత్రం దర్శక ధీరుడిగా మురిసిపోతున్నాడు. 

SS Rajamouli Craze after Baahubali:

Fans make huge cutouts of Baahubali 2 stars Prabhas, Rana Daggubati and SS Rajamouli. SS Rajamouli Craze Reached Tollywood Star Heroes.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ