ఇటీవల కాలంలో కె.విశ్వనాథ్‌తో చిత్రం చేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. కారణం... ఒక్కటే.. ఆయన కమర్షియల్‌గా ఈమధ్యసక్సెస్‌పుల్ చిత్రాలను ఇవ్వలేకపోతున్నాడు. 'శుభసంకల్పం' తర్వాత ఆయన పరిస్థితి అలా ఏర్పడింది. చివరకు శ్రీకాంత్, అల్లరి నరేష్‌లు కూడా ఆయన చిత్రాలలో నటించినందుకు గర్వంగా ఫీలవ్వకుండా తమ సన్నిహితుల వద్ద ఆ చిత్రాలు ఆడవని తెలిసినా నటించడం తమ గొప్పతని చెప్పుకున్నారనే వార్తలు వున్నాయి.
ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో స్పందించారు. ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాలో విశ్వనాథ్ గారు ఓ మంచి పాత్రలో నటిస్తామంటే తాము గర్విస్తామని తెలిపారు. అంతేకాదు... ఈ వయసులో కూడా విశ్వనాథ్ గారు ఓ చిత్రం చేస్తానంటే దానిని తాను గానీ, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద గానీ నిర్మించి, తమ బేనర్‌లు గర్వంగా తలెత్తుకునేలా చేసుకునేందుకు, మరో ఆణిముత్యం వంటి చిత్రాన్ని చేస్తానంటే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించేందుకు తాము ఎల్లప్పుడు సిద్దమని ప్రకటించి, కుహనా ప్రొడ్యూసర్, హీరోలు సిగ్గుపడేలా చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు.