మనలోమనం ఎన్నైనా విమర్శలు చేసుకుంటాం. ఇక విమర్శలు చేయడానికి, ఇష్టం వచ్చినట్లు, నోటికి ఏది వస్తే అది మాట్లాడటానికి చాలా తేడా ఉంది. మరి ఇది ఎంత మందికి అర్దమవుతుందో...? ఇక విషయానికి వస్తే తాను ఒకే ఒక్క చెత్త సినిమా తీసి, ఇక తన వల్ల కాదని తెలుసుకుని వార్తల్లో ఉండటం కోసం కారుకూతలు కూస్తున్నాడు సో కాల్డ్ బాలీవుడ్ క్రిటిక్, ఫిలిం మేకర్ కమలాఖాన్. ఆమద్య 'సర్దార్ గబ్బర్‌సింగ్' సమయంలో పవన్ ఓ కార్టూన్ హీరోలాగా ఉన్నాడని, అతడే హీరో అయితే ఎవరైనా హీరో కావచ్చని, అతని కంటే బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ బాగుటాడని, సౌత్ పీపుల్ టేస్ట్ టూ బ్యాడ్ అన్నాడు.
సమంతాను.. నీకంటే మా దీపికాపడుకొనే హెయిర్ స్టైలిస్ట్ అందంగా ఉంటుంది. నువ్వు సౌత్‌లో టాప్ హీరోయిన్‌వట కదా.! అని ఎగతాళి చేశాడు. రజనీకాంత్ ఛండాలంగా ఉంటాడని, అతనేం సూపర్‌స్టార్ అన్నాడు. మోహన్‌లాల్‌ను చోటా భీమ్‌లా ఉంటావని ఎద్దేవా చేశాడు. ఇప్పుడు 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రంపై ఓ వీడియో రూపొందించాడు. ప్రబాస్ ఒంటెలా ఉంటాడని, అతడిని బాలీవుడ్ మేకర్స్ తీసుకుంటే వారూ జోకర్స్ అయిపోతారన్నాడు రాజమౌళి ఓ చూతియా డైరెక్టర్ అని, బాలీవుడ్‌లో అటు వంటి వారు వీధికొకరు ఉంటారని ఎద్దేవా చేశాడు.
సినిమాలో కథ లేదు. సంగీతం బాగా లేదు. గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌లు ఛండాలంగా ఉన్నాయి. ఎడిటింగ్ ఘోరంగా ఉంది. మూడు గంటలు బోర్ కొట్టించారు. మూడు గంటలకు తగ్గ కంటెంట్ లేదు. ఈ చిత్రం చిన్న పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకోవడానికే పనికొస్తుందని నానా కూతలు కూశాడు. కానీకొందరు గిట్టని వారు ఇతనికి డబ్బులు ఇచ్చి.. ఇలా మాట్లాడిస్తున్నారని ఇటీవల తేలింది. 'శివాయ్' చిత్రాన్ని తిట్టినందకు స్వయంగా కరణ్‌జోహర్ ఇతనికి డబ్బులిచ్చి మాట్లాడించాడని తేలింది. మరి మనవైపు నుంచి కమాల్ ఖాన్‌కి చెక్‌పెట్టే వారే లేరా? ఏమైనా ఇది ఒక్క వర్మకే సాధ్యం. వర్మజీ.. కమాల్ కుక్కు ఏదో వాగుతోంది.. మీరే అతనికి సరైన గురువు.. లెట్ స్టార్ట్ ద గేమ్..!