పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 'అక్కడ అబ్బాయ్.... ఇక్కడ అమ్మాయ్'తో తెరంగేట్రం చేశాడని తెలుసు. కాగా త్వరలో ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 25వ చిత్రం చేస్తున్నాడు. కానీ అంతకు ముందే పవన్ ఓ చిత్రంలో ఓ చిన్నడైలాగ్‌కి డబ్బింగ్ చెప్పిన విషయాన్ని తాజాగా వెల్లడించి అశ్చర్యపరిచాడు. తాను 16వ ఏట ఉండగా చెన్నైలో అన్నయ్య వాళ్లింట్లో ఉండేవాడినని, ఆ ఇంటికి దగ్గరలోనే డబ్బింగ్ స్టూడియో ఉండేదని తెలిపాడు.
అప్పుడు అన్నయ్య కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో 'శుభలేఖ' చిత్రం చేస్తున్నాడన్నాడు. ఆ చిత్రం కోసం అన్నయ్య డబ్బింగ్ చెప్పేపనిలో ఉండగా, తాను ఓ రోజు తన అన్నయ్య కోసం టీ తీసుకుని రికార్డింగ్ థియేటర్‌కి వెళ్లానని, అక్కడ తన చేత చిత్రంలోని ఓ చిన్న డైలాగ్‌కు డబ్బింగ్ చెప్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 'మంచి నీళ్లు ఎక్కడ సార్..?' అనే చిన్న డైలాగ్‌ను తాను చెప్పానని, ఆ చిత్రంలో అన్నయ్య కూడా సర్వర్ వేషం వేశాడని గుర్తు చేసుకున్నాడు. ఇలా తన తొలిసినిమా ఎంట్రీ దాదా సాహెబ్ అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ గారి చేతులు మీదుగా జరిగిపోయిందనే విషయాన్ని ఆయన బయటపెట్టి ఆశ్యర్యపరిచాడు.