Advertisementt

'బాహుబలి2'ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు బ్రేక్‌ వేసింది!

Sun 30th Apr 2017 08:10 PM
baahubali 2 movie,rajamouli,nagarjuna,raju gari gadhi 2 movie  'బాహుబలి2'ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు బ్రేక్‌ వేసింది!
'Baahubali 2' breaks that bad sentiment..! 'బాహుబలి2'ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు బ్రేక్‌ వేసింది!
Advertisement
Ads by CJ

'బాహుబలి-ది బిగినింగ్‌'కి 'బాహుబలి-దికన్‌క్లూజన్‌' చిత్రం సీక్వెలా కాదా? అనే చర్చను పక్కనపెడితే పార్ట్‌2గా, సీక్వెల్‌గా, అదే టైటిల్‌తో వచ్చే సిరీస్‌లు టాలీవుడ్‌కి పెద్దగా కలిసి రాలేదు. 'శంకర్‌దాదా జిందాబాద్‌, ఆర్య2, సర్దార్‌గబ్బర్‌సింగ్‌, కిక్‌2' ఇలా అన్ని తిరుగుటపా కట్టిన చిత్రాలే. దాంతో రెండో పార్ట్‌ను తీయాలంటేనే మన దర్శకనిర్మాతలు, హీరోలు భయపడిపోతున్నారు. ఫలానా సినిమాకు సీక్వెల్‌ అంటే చాలు.. ఇక ఆ చిత్రం ఖచ్చితంగా డిజాస్టర్‌ అనే లెక్కలోకి వచ్చేశారు. 

కానీ ఈ బ్యాడ్‌సెంటిమెంట్‌కు 'బాహుబలి-దికన్‌క్లూజన్‌' చిత్రం చెక్‌ పెట్టింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో నడుస్తోంది. సో.. ఇకనైనా మన మేకర్స్‌ ఊపిరి పీల్చుకోవచ్చనిపిస్తోంది. ప్రస్తుతం అలనాటి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన 'లేడీస్‌టైలర్‌'కి కొనసాగింపుగా ప్రస్తుతం పెద్ద వంశీ సుమంత్‌ అశ్విన్‌ హీరోగా 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. మరోపక్క ఓంకార్‌ దర్శకత్వంలో నాగార్జున, సమంత, సీరత్‌కపూర్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో 'రాజుగారి గది2' రూపొందుతోంది. సో.. ఈ చిత్రాలు కూడా 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' ఇచ్చిన స్ఫూర్తితో ప్రేక్షకుల్లో బ్యాడ్‌ సెంటిమెంట్‌ను చెరిపేసి విజయం సాధిస్తాయని ఆశించవచ్చు..! 

'Baahubali 2' breaks that bad sentiment..!:

'Baahubali-The Beginning', 'Bahubali-The Conclusion' is not a movie sequel? As part of the discussion, as part2, sequel, the series with the same title did not bring much to Tollywood. But this bad sentiment was inspired by the film 'Bahubali-The Conclusion'.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ