కమర్షియల్ సినిమాకు వన్నెలద్దగలిగిన మేధావి రాజమౌళి. ఆయనకు రికార్డులు కొత్తకాదు. 'సింహాద్రి'తోనే ఆయన తన సత్తా చాటాడు. అత్యధిక సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా ఇప్పటికీ ఆ చిత్రం పేరు మీద రికార్డు ఉంది. ఇక ఎంత బడ్జెట్‌ను ఖర్చుపెట్టినా కూడా కలెక్షన్లలో తెలుగు సినిమా స్థాయి 50కోట్లు చేరదా? అని అందరూ బాధపడుతున్న సమయంలో ఆ రికార్డును 'మగధీర'తో సుసాద్యం చేశాడు. ఇక కేవలం బాలీవుడ్ సినిమాలకే సాధ్యమయ్యే 100కోట్ల క్లబ్‌పై కన్నేశాడు.
పనిలో పనిగా 'బాహుబలి-ది బిగినింగ్'ని తీశాడు. ఈ చిత్రం తెలుగులో 100కోట్ల మార్కును అవలీలగా సాధించింది. ఇక ఈ చిత్రం విడుదలైన ప్రతి భారతీయ భాషలోనూవిజయం సాదించింది. బాలీవుడ్‌లో ఓ డబ్బింగ్ చిత్రం 100కోట్లు సాధించడం అంటే మాటలు కాదు.. దానికి ఇది సుసాధ్యం చేసింది. అత్యదిక కలెక్షన్లు సాదించిన చిత్రాలుగా ఉన్న 'పీకె, దంగల్'ల తర్వాతి స్థానంలో చోటు సంపాదించింది. కానీ ఇప్పటికే బాలీవుడ్ వారి 1000కోట్ల కల నెరవేరలేదు.
ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్' అదే వేటలో ఉంది. నిర్మాతలు స్వయంగా ప్రకటించకపోయినా కూడా ఈ చిత్రం తొలిరోజే దాదాపు 200కోట్లగ్రాస్‌ను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ చిత్రం 1000కోట్ల మార్కును చేరేది లేనిది ఓ వారంలో తెలిసిపోతుంది. ఈ చిత్రం ఆ ఘనతను సాధిస్తుందనే అందరూ ఆశిస్తున్నారు....!