సమంత త్వరలోనే అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టబోతుంది. నాగ చైతన్యని ప్రేమించడం దగ్గర నుండి సమంత అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గర అయ్యింది. ఇక ఈ ఏడాది మొదట్లోనే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సమంత ప్రస్తుతానికి నాగ చైతన్యతో కలిసి ఒకే ఇంట్లో ఉంటుందని. ఎవరి సినిమాలతో వారు బిజీగా గడుపుతూనే ఖాళీ సమయాల్లో చై- సామ్ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి డేట్ ఆఫీసియల్ గా అనౌన్స్ అవ్వలేదుగాని వచ్చే ఆగస్టులోగాని అక్టోబర్ లో గాని పెళ్లి అంటున్నారు పెద్దలు.
నాగ చైతన్యతో లవ్ ఎఫ్ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత సమంత నాగ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో అఖిల్ తో బాగా క్లోజ్ అయింది. అక్కినేని ఇంట ఏ ఫంక్షన్ అయినా పద్దతిగా అటెండ్ అవుతూ అందరిని ఆకర్షిస్తున్న సామ్ పార్టీల్లో మాత్రం హాట్ హాట్ గా రెచ్చిపోతుంది. నాగ చైతన్య బ్యాచిలర్ పార్టీ దగ్గర నుండి.... అఖిల్ ఎంగేజ్మెంట్ పార్టీ వరకు సమంత అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గకుండా పాల్గొంది.
ఇక తాజాగా సమంత ఈ శుక్రవారం తన బర్త్ డే పార్టీని ఫ్రెండ్స్ మధ్యలో కాబోయే భర్త తో కలిసి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. ఇక ఈ పార్టీలో సమంత సినిమా ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తోపాటు నాగ చైతన్య, అఖిల్ కూడా ఎంజాయ్ చేశారు. ఇక అఖిల్ వదిన గారూ అంటూ సామ్ ని సంబోధిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు సమంత బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.