బాలయ్యకు.. ఆయన అభిమానులకు ఓ చక్కటి సంబంధం ఉంది. తమ హీరో మనసులో ఏముందో వారు మాత్రమే అర్ధం చేసుకోగలరు. వారికిపెద్ద పెద్ద కోరికలు ఏమీ ఉండవు. బోళాశంకరులు.. ఓ పవర్‌ఫుల్ టైటిల్... విభిన్నమైన గెటప్.. ఓ ఐదారు ప్యామిలీ పొగడ్తలతో కూడిన పవర్‌ఫుల్ డైలాగులు, ఓ పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్.. ఓ వెరైటీ గెటప్.. ఇది చాలా ముఖ్యం.. ఇవ్వుంటే చాలు.. అభిమానులు పండగ చేసుకుంటారు. థియేటర్లకు పోటెత్తి.. సామాన్య, న్యూట్రల్ ప్రేక్షకులు చూడకపోయిన తమ హీరో చిత్రాలను తామే చూసి చూసి తరించి.. హిట్ చేస్తారు.
ఈ ఫార్ములాని కనిపెట్టిన నేటితరం దర్శకుడు బోయపాటి శ్రీను. తన 'సింహా, లెజెండ్'లలో అదే చేసి సూపర్‌హిట్స్ కొట్టాడు. ఇక కథలో కాస్త వైవిధ్యం చూపి, తనవంతు శ్రమను, తనదైన శైలిని మిస్ కాకుండా డైరెక్టర్ క్రిష్ కూడా 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో అదే చేసి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు పూరీ వంతు. పూరీకి హీరోలను ఎలా చూపించాలో బాగా తెలుసు. పంచ్ డైలాగులు, పవర్‌ఫుల్ డైలాగ్స్, హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా సీన్స్, హీరోయిజాన్ని పీక్స్‌కి తీసుకెళ్లడం, డిఫరెంట్ గెటప్‌తో అలరించేలా చూడటం పూరీ ప్రత్యేకత. ఇక ఆయన టైటిల్స్ కూడా అంతే. ఇక పూరీ చిత్రంలో కూడా బాలయ్య ఎలా కనిపించనున్నాడో అర్దమవుతోంది. ఈసారి కూడా మీసాలు పెంచి కిందకి దించుతున్నాడు. సో.. బాలయ్యకు, పూరీకి హిట్ గ్యారంటీ.. ఇక నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే సంబరాలు చేసుకోవచ్చు.. ఎనీ డౌట్స్...?