తాజాగా విడుదలైన 'బాహుబలి-ది కన్‌క్లూజన్'చిత్రానికి కీరవాణి సరైన సంగీతం అందించలేదని మీడియా ముఖంగా కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి సరితూగేలా లేదని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాజమౌళి పడిన కష్టంలో కీరవాణి కొంత శాతమైన పడివుంటే చిత్రం ఇంకా ఎక్కడికో వెళ్లిపోయేదంటున్నారు. ఇలాంటి చిత్రాలకు బీజీఎం చాలా ముఖ్యమని, రోమాలు నిక్కబొడుచుకునేలా బీజీఎంని ఇవ్వాల్సిన కీరవాణి చాలా సాదా సీదా సంగీతాన్ని అందించాడంటున్నారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు.
కానీ ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలలో అందరూ కీరవాణి బీజీఎం చాలా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. కానీ అది సామాన్య ప్రేక్షకుల అభిప్రాయంతో విరుద్దంగా ఉంది. నిజానికి రాజమౌళి.. దర్శకునిగా ఎదిగే క్రమంలో కీరవాణి పాత్ర ఎంతో గొప్పది. కానీ 'బాహుబలి-ది బిగ్‌నింగ్' విషయంలో కూడా కొన్ని చోట్ల కీరవాణి విఫలమయ్యాడు. కానీ ఆనాడు ఆ మాట అంటే అందరూ ఒక్క కాలిపై పైకి లేచి జెలసీతో వ్యాఖ్యలు చేసి, విమర్శిస్తున్నామన్నారు. కానీ అందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండాలని లేదు.
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది అనేది వాస్తవం. ఇక 'బాహుబలి' రెండు పార్ట్‌లకు కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్‌ని బాగా చేశాడు. కానీ ఈ రెండు పార్ట్‌లలోని పాటలకు మాత్రం ఆయన తన స్థాయి స్వరాలను స్వరపరచలేకపోయాడు అనేది వాస్తవం. 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లో కూడా ఆయన కేవలం రెండుపాటలకు మాత్రమే మంచి ట్యూన్స్‌ని, చిరకాలం గుర్తుండే పాటలను అందించాడనేది మాత్రం వాస్తవం.