బాహుబలి టాలీవుడ్ సినీచరిత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. ఒక్క భాషలోనే కాక ఇండియాలో ఉన్న అనేక భాషల్లో ఈ సినిమా డబ్ అయ్యి విడుదలైంది. ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అయినా హిట్ అవ్వకపోతే ఆ చిత్రం గురించి విపరీతమైన ప్రచారం జరిగేది. అదే హిట్ అయితే ఆ సినిమా కలెక్షన్స్ కి దానికి ముడి పెట్టేసి కామ్ గా ఉండేవారు. హిట్టవకపోతే చూసారు.... ఎంత భారీగా ఖర్చు పెట్టి డబ్బు నీళ్లలా వాడేసిన సినిమా హిట్ అవ్వలేదని దుమ్మెత్తిపోస్తారు. ఇక గత ఐదేళ్లుగా డబ్బుని లెక్క చెయ్యకుండా నిజమైన హీరోలుగా దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి బాహుబలికి ఖర్చు పెట్టిన నిర్మాతలు శోభు యార్లగడ్డకి, ప్రసాద్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అదలా ఉంటే బాహుబలికి బడ్జెట్ గురించి కన్నా ఇప్పుడు ప్రభాస్ రెమ్యునరేషన్ మీద హాట్ హాట్ చర్చ మొదలైంది.
అసలు బాహుబలిలో నటించిన ప్రభాస్ కి హాలీవుడ్ రేంజ్ లో ప్రపంచం మొత్తం మీద పేరొచ్చేసింది. ఒకే ఒక్క చిత్రంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మరి ఐదేళ్లు కాలాన్ని బాహుబలికి వెచ్చించినందుకు గాను ప్రభాస్ కి తగిన ప్రతిఫలం బాహుబలి ఇచ్చింది. ఇక ప్రభాస్ బాహుబలి రికార్డ్ ని ఇప్పట్లో ఎవ్వరూ తాకనైనా తాకలేని పరిస్థితిని రాజమౌళి సృష్టించాడు ఒక్క బాహుబలి చిత్రంతో. మరి ప్రభాస్ ఐదేళ్ల కష్టానికి మొదటి భాగానికి గాను 7 కోట్లు, రెండో భాగానికి గాను 18 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడట.
మరి ప్రభాస్ ఈ ఐదేళ్ళలో కనీసం నాలుగు చిత్రాలు చేసిన తేలిగ్గా 40 కోట్లు.. రెమ్యునరేషన్ ద్వారా రాబట్టేవాడు. కానీ ఇప్పుడు బాహుబలికి కేవలం 25 కోట్లు మాత్రమే తీసుకున్నాడు. మరి ప్రభాస్ ఎంతైనా గ్రేట్. కానీ ఇపుడు ప్రభాస్ కి వచ్చిన పేరు ప్రఖ్యాతులని రెమ్యూనరేషన్ తో సరితూచగలమా!