మాఫియాడాన్, పలు భారత్ పేలుళ్ల కుట్రదారి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నాడని అందరికీ తెలుసు. కానీ ఆ దేశం మాత్రం మా దగ్గర లేడని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తాజా సమాచారం ప్రకారం దావూద్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుడి భాగానికి మొత్తం పక్షవాతం రావడమే కాకుండా మెదడులో కణితి వల్ల బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. ఇక తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో కరాచిలోని ఓ ప్రముఖ వైద్యశాలలో విదేశీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ముంబై స్థావరంతో ఎన్నో అకృత్యాలకు, దుర్ఘటనలకు కేంద్రబిందువైన దావూద్ తండ్రి సమాధి ముంబైలోనే ఉంది. కాగా ఆయన భారీ రేటు చెల్లించి అదే సమాధి పక్కన ఓ ఖరీదైన స్థలాన్ని తన మరణానంతరం సమాధి చేయడానికి కొన్నాడట. మరోపక్కన ఇప్పటికీ ముంబైలో ఉన్న దావూద్ సోదరుడి ఇంటికి దావూద్‌కి ఆనారోగ్యం అని తెలిసి ఆయన అభిమానులు తండోపతండాలుగా వచ్చి పరామర్శిస్తున్నారు. షార్జా క్రికెట్ టోర్నీలు జరిగినప్పుడే దావూద్‌కి బాలీవుడ్‌లో, ఇండియన్ క్రికెట్‌లో ఉన్న దోస్తులు ఎందరో వెలుగు చూశారు.
తాజా సమాచారం ప్రకారం దావూద్ సోదరుడి ఇంటిలోని ఫోన్స్ నిన్నటి నుంచి నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయని, ఇందులో పలువురు బాలీవుడ్ స్టార్స్, క్రికెట్ మాజీ ఆటగాళ్లు, బాలీవుడ్ నిర్మాతలు, ఫైనాన్షియర్స్, హీరోయిన్లు కూడా ఉన్నారట. చత్తీస్‌గడ్‌లో మావోల చేతిలో చనిపోయిన వీర జవానులను పలకరించే నాధుడు లేడు. సీనియర్ స్టార్ వినోద్‌ఖన్నా చనిపోతే అంత్యక్రియలకు కూడా రాని మహానుభావులు దావూద్‌కి అనారోగ్యం వార్త విని తల్లడిల్లిపోతున్నారు. ఏం..దేశం ఎటు పోతోంది....?