Advertisementt

నారా లోకేష్‌ బాబూ.. ఇది చేస్తే బెటర్..!

Sat 29th Apr 2017 09:28 PM
nara lokesh,nara brahmani,nara brahmani heritage speech,tdp,tution  నారా లోకేష్‌ బాబూ.. ఇది చేస్తే బెటర్..!
Nara Brahmani Tution For Nara Lokesh నారా లోకేష్‌ బాబూ.. ఇది చేస్తే బెటర్..!
Advertisement
Ads by CJ

పండిత పుత్ర:.. పరమ శుంఠ: అనే నానుడి ఊరకనే రాలేదు. నారా లోకేష్‌ని చూస్తే ఇది నిజమనిపించకమానదు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడో.. ఏమి మాట్లాడుతాడో కూడా ఆయనకే తెలియదు. దాంతో వైసీపీకి చెందిన రోజా ఆయనకు పప్పు.. వెర్రిపప్పు అనే బిరుదును ఇచ్చింది. ఇక నారాలోకేష్‌ పాండిత్యంపై సోషల్‌ మీడియాలో చెణుకులు, సెటైర్లు పేలుతున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లకు ఎలా కౌంటర్‌ ఇవ్వాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 

పోనీ.. వాటిని వదిలేసి, తమ పని తాము చూసుకుని ఉంటే బాగుండేది. కానీ లోకేష్‌పై సోషల్‌ మీడియాలో పొలిటికల్‌ పంచ్‌లు విసురుతున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి, ఆ వ్యక్తిని, పొలిటికల్‌ సెటైర్‌ను పాపులర్‌ చేశారు తెలుగు తమ్ముళ్లు. ఇక ఏదో రోజా కాబట్టి ఏదో లోకేష్‌పై పప్పు అని పంచ్‌ వేసిందిలే అని సమర్దించుకోవచ్చు. కానీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడే ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా నిజమే..లోకేష్‌ పప్పు.. నిజమే కదా...! అందులో తప్పేముందని ఏడా పెడా వాయించాడు. ఇక తన మావ బాలయ్య వాక్చాతుర్యం లోకేష్‌కి వస్తే బాలయ్య కూతురు, నారాలోకేష్‌ సతీమణి మాత్రం తన తాత నుండి మంచి వాగ్దాటిని వారసత్వంగా సంపాదించిందని అర్దమవుతోంది. 

తనకు రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదని చెప్పిన బ్రాహ్మణి ప్రస్తుతం తాను చూస్తున్న హెరిటేజ్‌ సంస్థను దక్షిణాది నుంచి ఉత్తరాదికి కూడా పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం ఎక్కడా తడబాబు లేకుండా అద్భుతంగా సాగింది. ప్రతి ఇంటికి ఓ గ్లాసుడు పాలు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పి, అనర్గళంగా ప్రసంగించింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు హాజరైన ఈ సమావేశంలో ఆమె మాట్లాడిన అనంతరం అందరూ లేచి చప్పట్లలో ఆడిటోరియంని మోతెక్కించారనేది వాస్తవం. కాబట్టి లోకేష్‌.. తన భార్య బ్రాహ్మణి నుంచి ప్రసంగాలు ఎలా చేయాలో ట్యూషన్‌ చెప్పించుకుంటే బాగుంటుందనేది చిన్న సలహా మాత్రమే.....! 

Nara Brahmani Tution For Nara Lokesh:

Nara Brahmani in her speech at Heritage 25 Years Celebrations said Heritage wants to continue to empower the farmer for which they have to delight every family with high quality product. Other Side Many Satires on Nara Lokesh Speech. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ