ఇటీవల చత్తీస్‌గడ్‌లోని సుకుమా జిల్లాలో మావోలు పంజా విసరడంతో దాదాపు 25మందికిపైగా సీఆరీపీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒక్క మావో చనిపోయినా గగ్గోలు పెట్టే మానవ హక్కుల సంఘాలు మాత్రం ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. ఇక ప్రభుత్వం కూడా ఆ అమరవీరుల కుటుంబాలకు ఏమి సహాయం చేయనుందో కూడా తెలియడం లేదు. కానీ ఈ విషయంలో క్రికెటర్ గౌతమ్ గంబీర్ స్పందించాడు.చనిపోయిన వీర జవాన్ల పిల్లలందరి బాధ్యతలను తన గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ద్వారా తానే చూసుకుంటానని తెలిపాడు.
ఈ వార్తను పత్రికల్లో చదివానన, ఆ వీర జవాన్ల సంతానాన్ని చూసి తాను ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నానని ఆయన తెలిపాడు. కాగా ఢిల్లీకి చెందిన ఈ ఓపెనింగ్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ కొంతకాలంగా టీమ్‌కి ఎంపిక కాలేకపోతున్నాడు. కానీ ఐపిఎల్‌లో కోల్‌కత్తాకు కెప్టెన్‌గా తన సత్తా చాటుతున్నాడు. కాగా ఇటీవల ఆయన తాను బతికుండగానే తాను మరణించిన తర్వాత తన శరీర అవయవాలన్నింటినీ దానం చేసిన తొలిక్రికెటర్‌గా తన మానవత్వాన్ని చాటుకున్నాడు. శభాష్...గౌతమ్ గంభీర్....!