Advertisementt

పాత్రలు మారిన... ఇంట్రస్టింగ్‌గా ఉంది..!

Sat 29th Apr 2017 06:55 PM
chiyan vikram,director gautham menone,dhruvanakshatram movie,prudhvi raj  పాత్రలు మారిన... ఇంట్రస్టింగ్‌గా ఉంది..!
Vikram - Characters Changed But interesting పాత్రలు మారిన... ఇంట్రస్టింగ్‌గా ఉంది..!
Advertisement
Ads by CJ

చియాన్‌ విక్రమ్‌. ఆయనది ఓ ప్రత్యేక ఒరవడి.. ఎన్ని అపజయాలు ఎదురైనా.. ప్రయోగాలకు ఈయన వెరవడు. 'అపరిచితుడు' తర్వాత ఈయనకు మరో పెద్ద హిట్‌ లేదు. అయినా ఆయనతో కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు సిద్దంగానే ఉంటారు. కమల్‌హాసన్‌ తర్వాత దక్షిణాదిలో ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా విక్రమ్‌నే చెప్పాలి. 

కాగా ప్రస్తుతం విక్రమ్‌ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో 'ధృవనక్షత్రం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి. కానీ ఈ టీజర్స్‌లో చిత్రంలోని విలన్‌ని రివీల్‌ చేయలేదు. కానీ ఆయన వాయిస్‌ ఓవర్‌తో కొన్ని షాట్స్‌ చిత్రీకరించారు. ఆ వాయిస్‌ మరెవ్వరిదో కాదు.. మలయాళ హీరో పృథ్వీరాజ్‌ది. పృథ్వీరాజ్‌ ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత చేకూరింది. విక్రమ్‌ విలన్‌గా నటించగా, మణిరత్నం దర్శకత్వంలో వచ్చి అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచిన విలన్‌ చిత్రంలో విలన్‌గా టైటిల్‌రోల్‌ను విక్రమ్‌ పోషించాడు. 

చేసింది కొద్ది నిమిషాల పాత్రే అయినా హీరో వంటి వేషంలో పృథ్వీరాజ్‌ కనిపించాడు. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా 'దృవనక్షత్రం' చిత్రంలో విక్రమ్‌ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ విలన్‌ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ మూవీ ఆగష్టు 11న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరి ఈ చిత్రమైనా 'విలన్‌' ఫలితాన్ని తిరగరాస్తుందో లేదో వేచిచూడాల్సివుంది....! 

Vikram - Characters Changed But interesting:

After Kamal Haasan, Vikram is the care of address for experiments in the south. Vikram is currently acting the film 'Dhruva Nakhatram' directed by Goutham Menon. Prudhviraj has acted in this movie and the film is a special feature.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ