రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి, విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చిన వారిలో ఒకరైన నారాయణ సంస్థల అధినేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశభాషలందు తెలుగు లెస్స.. అన్న విషయాన్ని మర్చిపోయి, తెలుగు మీడియంలలో చదవడం వృథా అని వ్యాఖ్యలు చేశాడు. తెలుగు మీడియంలో చదువుకునే విద్యార్ధులకు 5000 ర్యాంకులలోపు రావని, కాబట్టి వారు కూడా ఇంగ్లీషు మాద్యమంపై దృష్టి పెట్టాలన్నాడు.
అందుకే తాము ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాద్యమాన్ని ప్రవేశపెట్టినట్లు ముక్తాయించారు. నిజమే.. ఆయన చెప్పిన దానిలో అర్ధం ఉన్నా సరే.. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చిన్నారి విద్యార్ధుల మనసులను కలుషితం చేసేవిగా ఉన్నాయి. వీధి బళ్లులో చదువుకొని, అనర్ఘళంగా ఎన్నో బాషలను, ఇంగ్లీషుతో పాటు ఎన్నో విదేశీభాషలను కూడా నేర్చుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు. చదువులకు ర్యాంకులు, సీట్లే కొలమానం కావు. నాటి రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి పివి నరసింహారావు, సర్వేపల్లి రాధాకృష్ణన్, రామానుజం, అబ్దుల్‌కలాంల వరకు ఎవ్వరూ ఇంగ్లీషు మీడియంలలో చదువుకోలేదు.
మరి ర్యాంకుల కోసమే చదువులైతే అవి విద్యార్ధులకు అవసరం లేదు. ఇక భవిష్యత్తులో ఆయన ర్యాంకులు రాని విద్యార్ధులు కూడా ఉంటారేమో... అన్నా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు...! నారాయణ సంస్థల అధినేత ఇలాంటి వ్యాఖ్యలను ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చేయడం శోచనీయం...!