Advertisementt

మెగాహీరో తలరాత మారేనా..?

Fri 28th Apr 2017 06:42 PM
varun tej,mega hero varun tej,dil raju,fida movie,director sekhar kammula  మెగాహీరో తలరాత మారేనా..?
Mega Hero Varu Tej Fate is Changing? మెగాహీరో తలరాత మారేనా..?
Advertisement
Ads by CJ

విభిన్న చిత్రాలైన 'ముకుంద, కంచె'లు పెద్ద విజయం సాధించకున్నా, విభిన్న చిత్రాలుగా, మంచి నటనను చూపించాడనే ప్రశంసలను మెగాహీరో వరుణ్‌తేజ్‌కి ఇవి తెచ్చిపెట్టాయి. కానీ ఆ మంచి పేరును 'లోఫర్‌, మిస్టర్‌' వంటి చిత్రాలు తుడిచేశాయి. దీంతో వరుణ్‌తేజ్‌ తాజాగా తాను దిల్‌రాజు నిర్మాతగా శేఖర్‌కమ్ముల వంటి వైవిద్యదర్శకునితో చేస్తున్న 'ఫిదా' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 

ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. మరోపక్క వరుణ్‌తేజ్‌ తాజాగా వెంకీ అట్లూరి అనే నూతన దర్శకునికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పేరున్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. తమన్‌ సంగీతాన్ని అందిస్తుండగా, 'కత్తి, రాజు రాణి, తేరి' వంటి హిట్‌ చిత్రాలకు సినిమాటోగ్రఫీని అందించిన జార్జ్‌ విలియమ్స్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. 

ఇక ఇటీవలే ఈ చిత్రం మ్యూజికల్‌సిట్టింగ్స్‌ కూడా చడీ చప్పుడు లేకుండా ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌కి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యాయి.ఈ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో సినిమాటోగ్రాఫర్‌ కూడా పాల్గొంటుండటం విశేషం. మరి ఈ రెండు చిత్రాలైన వరుణ్‌ కెరీర్‌ను గాడిలో పెడతాయో లేదో వేచిచూడాల్సివుంది...! 

Mega Hero Varu Tej Fate is Changing?:

Varun Tej has recently made a lot of hopes on the film 'Fida', which is being produced by Dil Raju director by Shekhar kammula the film is shooting fast. On the other hand, Varuntej has recently announced the new director Venky Atluri is okay and the two of these films, Varun, are going to be in the groove to wait!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ