ప్రోఫెసర్ కోదండ రాం అధికార టీఆర్‌ఎస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్నదని, దానిని పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో విద్యార్ధుల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుందని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపి, ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన నీరుద్యోగ యువతను అధికార పార్టీ మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
మరోపక్క కోదండరాంతో త్వరలో గద్దర్ సమావేశం కానున్నట్లు సమాచారం. వారి మధ్య ఖచ్చితంగా జనసేన ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క కొన్ని పార్టీలు, మేధావులు పార్టీలు స్థాపించి ప్రజల్లో ఎన్నో కోరికలు, ఆశలు చిగురింపజేస్తారు. ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీలాగా. కానీ వారికి చాలా తక్కువ కాలంలోనే అధికారం అప్పగించిన ప్రజలు కూడా తర్వాత వారి ఏలుబడిని చూసి విరక్తి చెందుతున్నారు.
దీనికి తాజాగా ఢిల్లీలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర పరాభవం, బిజెపి విజయం ఓ ఉదాహరణ. కాగా ఇది ప్రస్తుతం గద్దర్, కోదండరాం, పవన్ వంటి వారిని తొలుస్తున్నప్రశ్నగా చెబుతున్నారు. మరి చూద్దాం.. పవన్‌కి గద్దర్, కోదండరాంలు ఎలాంటి సమాధానం ఇస్తారో...?