Advertisementt

గోల్డెన్‌ లెగ్‌ కాస్త ఐరన్‌లెగ్‌గా మారిపోయింది..!

Fri 28th Apr 2017 05:56 PM
heroine sonakshi sinha,indian actress sonakshi sinha,rajinikanth  గోల్డెన్‌ లెగ్‌ కాస్త ఐరన్‌లెగ్‌గా మారిపోయింది..!
Sonakshi Sinha-Golden Leg Changes to Iron Leg గోల్డెన్‌ లెగ్‌ కాస్త ఐరన్‌లెగ్‌గా మారిపోయింది..!
Advertisement
Ads by CJ

సినిమా బ్యాగ్రౌండ్‌తో పాటు హీరోయిన్లకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షిసిన్హాం. కెరీర్‌ ప్రారంభంలో ఆమెది గోల్డెన్‌లెగ్‌. ఆమె నటిస్తే చాలు సినిమాలు హిట్టవుతాయనే ప్రశంసలు పొందింది. పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ చేయకపోయినా, కాస్త బొద్దుగా ఉన్నా ఆమె నటంచిన చిత్రాలన్నీ బాగా హిట్టయ్యాయి.దాంతో దర్శకనిర్మాతలే కాదు.. నాటి హీరోలు కూడా ఆమె ఇంటిముందు క్యూకట్టారు. ఆమె ఆడింది ఆట పాడింది పాట అన్న విధంగా కెరీర్‌ కొనసాగింది. 

తోటి స్టార్‌ హీరోయిన్లు ఆమెను చూసి భయపడ్డారు. కానీ కాలం ఒకే రకంగా ఉండదు కదా....! గోల్డెన్‌ లెగ్‌ కాస్త ఐరన్‌లెగ్‌గా మారిపోయింది. 2012లో వచ్చిన 'దబాంగ్‌2' తర్వాత ఆస్థాయి హిట్‌ లేదు. ఈ ఐదేళ్లు ఆమెకు చుక్కలు చూపించాయి. దాంతో ఎక్స్‌పోజింగ్‌కు, నటనకు కూడా మెరుగులు దిద్దుకుంది. బాడీపై శ్రద్ద పెట్టింది. కానీ ఆమెను పట్టిన ఏలిన నాటి శని మాత్రం వదలలేదు. 'యాక్షన్‌ జాక్సన్‌' నుంచి 'అకారా' వరకు తాజాగా జర్నలిస్ట్‌గా నటించిన 'నూర్‌' చిత్రంలో కూడా తన నటనతో ఆమె ఆకట్టుకుంది. 

కానీ ఈ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. ఫ్లాప్‌ ముద్రను వేసుకుంది. మరి ఏలిన నాటి శని ప్రభావం ఆమె కెరీర్‌పై ఎంతకాలం ఉంటుంది? ఆమెకు బ్రేక్‌నిచ్చే హీరో, దర్శకుడు, సినిమా ఏమిటి? అనే విషయం కాలమే నిర్ణయించాలి. ఇక సౌత్‌లో అయినా రాణించాలని ఆమె ఏకంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో చేసిన 'లింగ' చిత్రం కూడా దెబ్బతినడంతో నిజంగానే ఆమెను దురదృష్టం వరించిందని చెప్పాలి. ఇక ఆమె కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడినట్లేనని, కొత్తగా వచ్చిన ముద్దు గుమ్మల ముందు ఇక ఈమె రాణించే అవకాశం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి...పాపం.. సోనాక్షి...! 

Sonakshi Sinha-Golden Leg Changes to Iron Leg:

Sonakshi sinha star heroine. Reserved golden leg the beginning of his career. She pretended to put the film has been praised hits.But now Sonakshi Sinha-Gloden leg change to iron leg.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ