మనవాడు, మనందరికీ గర్వకారణమైన కళాతపిస్వి కాశీనాధుని విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం మనకే గర్వకారణం. కానీ ఆయన తన చిత్రాల ద్వారా చేసింది ఏమీ లేదని, ఆయన కేవలం బ్రాహ్మణిజాన్నే ప్రోత్సహించాడని, ఆయన నటునిగా కూడా గొప్పగా ఏమీ సాధించలేదని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితం.
మొదట్లో సామాజిక చిత్రాలను తీసిన ఆయన ఆ తర్వాత కళాత్మక చిత్రాల వైపు, కుల వివక్ష వంటి వాటిపై దృష్టి పెట్టారు. 'స్వయంకృషి'లో చిరుని చెప్పులు కుట్టేవానిగా, 'ఆపద్బాంధవుడు'లో గోవుల కాపరిగా, 'సప్తపది'లో హీరోను దళితునిగా, 'శంకరాభరణం'లో కీలకమైన పాత్రను వేశ్యగా, 'స్వాతిముత్యం'లో వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా, 'స్వాతికిరణం'లో గర్విష్టి పండితునిగా, 'స్వర్ణకమలం'లో హీరోను ఓ పెయింటర్‌గా, హీరోయిన్‌ని సినిమాలపై, విదేశాలపై మోజు పడే ఓ యువతిగా చూపించిన ఆయనకు కులాన్ని అంటగట్టడం ఏమిటి?
నిజానికి ఈ అవార్డు ఆయనకు రావడం వెనుక వెంకయ్యనాయుడే ఉంటే ఆయనకు కూడా పాదాభివందనం చేయాలి. కేవలం రెండు మూడు కులాలనే ప్రోత్సహించే వారికి ఇది పద్దతికాదు. కావాలంటే మీరు కులం అనే బురదగుంటలో సేదతీరండి. అంతేగానీ అందరికీ కులం రంగును పులమడం సరికాదు.
నిజమే ఆయన నిర్మాత కాదు. తక్కువ డబ్బుకే పైరవీలు చేసి స్థలాలను స్టూడియో పేరుతో పొంది వాటిని రియల్‌ఎస్టేట్ వ్యాపారాలకు, తమ సొంత స్వార్జితంగా భావించే మనిషి ఆయన కాదు. విశ్వనాథ్‌ని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని తెలుసుకోవాలి...! ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే కాదు.. భారతరత్న ఇచ్చినా కూడా తక్కువే.