బాహుబలి మరి కొద్దీ గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా వుంది. ఈ రోజు రాత్రి నుండే దేశం మొత్తం బాహుబలి సందడి మొదలు కానుంది. రెండేళ్లుగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ తో కొట్టుమిట్టాడుతున్న జనాలకు బాహుబలి ద కంక్లూజన్ ముగింపునివ్వబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న బాహుబలి చిత్రం అప్పుడే పైరసీ పాలైందని అంటున్నారు.
1 .30 నిమిషాల నిడివిగల బాహుబలిలో కొన్ని సీన్స్ నెట్ లో లీకైనట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ లీకు తమిళ, హిందీ వెర్షన్స్ నుండి జరిగినట్లు చెబుతున్నారు. మరో పక్క నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి పైరసీ అవ్వలేదని... ఎక్కడా మూవీ లీక్ అవ్వలేదని చెబుతున్నాడు. మరి ఇక్కడేమో బాహుబలి 1 .30 నిమిషాల నిడివిగల వీడియో నెట్ లో హల్చల్ చేస్తుంది. ఇక ఆ వీడియోలో భల్లాల దేవుడు రాణాని రాజమాత రమ్యకృష్ణ రాజుగా పట్టాభిషేకం చేస్తుంది. అక్కడే వున్న బాహుబలి ప్రభాస్ ఒక సైనికుడిగా ఈ వేడుకని జరిపిస్తుంటాడు. ఇక రాణా వీర లెవల్లో రాజుగా ఫోజు కొడుతున్న వీడియోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
మరి ఇంకా సినిమా విడుదల కాకముందే ఇలా 1 .30 నిమిషాల వీడియో లీక్ అయిపోతే సినిమాని పైరసీ చెయ్యడం పెద్ద కష్టం కాదు పైరసీ రాయుళ్ళకి అంటున్నారు. ఇక ఎంతో శ్రమపడి రెండేళ్లుగా ఒక్క బాహుబలికే సమయాన్ని వెచ్చించిన రాజమౌళికి ఈ లీకులతో తలనొప్పి వచ్చేస్తుందని అంటున్నారు.