Advertisementt

ఎన్టీఆర్, బాలయ్య ల పై హాట్ హాట్ న్యూస్!

Thu 27th Apr 2017 06:11 PM
jr ntr,balakrishna,jai lava kusha,puri jagan,sarathi studios  ఎన్టీఆర్, బాలయ్య ల పై హాట్ హాట్ న్యూస్!
Jr. NTR, Balakrishna War Continues ఎన్టీఆర్, బాలయ్య ల పై హాట్ హాట్ న్యూస్!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ తన అన్న కొడుకు ఎన్టీఆర్ ని ఏ మాత్రం దగ్గరికి రానివ్వడు. ఇది జగమెరిగిన సత్యం. ఏదో ఎన్టీఆర్ పెళ్లప్పుడు కాస్త హడావిడి చేసిన బాలయ్య తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ని దేనికి కలుపుకోలేదు. దానికి కారణం ఆయన అల్లుడు లోకేష్. ఎక్కడ నందమూరి ఫ్యామిలి లో ఎన్టీఆర్ హైలెట్ అయితే ఆయన అల్లుడు లోకేష్ కి విలువ తగ్గుతుందనే భయంతోనే బాలకృష్ణ అండ్ చంద్రబాబు ఇలా చేస్తున్నారని కూడా తెలిసిందే. అయితే ఇవన్నీ సైలెంట్ గా చూస్తున్న ఎన్టీఆర్ మాత్రం హుందాగా గమ్మునుండిపోయాడు. అది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ హుందాతనమే.

మరో పక్కన హరికృష్ణ మరో కొడుకు కళ్యాణ్ రామ్ ని మాత్రం బాలకృష్ణ బాగానే చూస్తాడు. అందుకే ప్రతి ఫంక్షన్ కి కళ్యాణ్ రామ్ మాత్రం హాజరవుతూ ఉంటాడు. మొన్నటికి మొన్న లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి నందమూరి ఫ్యామిలీతోపాటే కళ్యాణ్ రామ్ కూడా హాజరయ్యాడు. అంటే కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలకృష్ణ తో సఖ్యతను మెయింటింగ్ చేస్తున్నాడు. ఇపుడు ఈ టాపిక్ రావడానికి తాజాగా బాలయ్యకి ఎన్టీఆర్ కి మధ్యన  ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అదేమిటంటే ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్ర షూటింగ్ కోసం సారధి స్టూడియోలో ఒక చిన్న సెట్ వేసారట. మరోపక్క బాలకృష్ణ కోసం పూరి డైరెక్షన్ లో తెరకెక్కే చిత్రానికి పోలీస్ స్టేషన్ సెట్ కూడా వేసారట. ఇక ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమా షూటింగ్ జరిగే టైమ్ కి బాలకృష్ణ కూడా అక్కడికి రావడంతో ఎవరో ఇక్కడే ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ జరుగుతుందని చెప్పడంతో బాలయ్య నెమ్మదిగా కార్ వ్యాన్ లోకి వెళ్ళిపోయాడట. రెండు గంటల తర్వాత ఎన్టీఆర్ షూటింగ్ అక్కడనుండి షిఫ్ట్ అయ్యిందట. 'జై లవ కుశ' కోసం వేసిన చిన్న సెట్ ని కూడా చకచకా తీసేశారని అంటున్నారు.  అయితే బాలకృష్ణ అక్కడికి రావడంతోనే ఎన్టీఆర్ సైలెంట్ గా అక్కడినుండి వెళ్లిపోయాడని టాక్ వినబడుతుండగా... కాదు కాదు ఇక్కడ సారథి స్టూడియోలో షూట్ అయ్యిపోయి అన్నపూర్ణ స్టూడియో కి షిఫ్ట్ కావడంతోనే ఎన్టీఆర్ చిత్ర బృందం అక్కడినుండి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

Jr. NTR, Balakrishna War Continues:

It is Known fact that there are clashes between Young Tiger Jr NTR and Balakrishna. Balakrishna's Puri jagan Movie shooting and Jr ntr's Jai Lava Kusha shooting in Same Location at Sarati Studios. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ