'బాహుబలి2' సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది. ప్రపంచం మొత్తం 'బాహుబలి ద కంక్లూజన్' కోసం ఎదురు చూస్తుంది. అసలు బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు. అనేదాని మీదే ఇప్పుడు హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఇంతటి సస్పెన్స్ నడుమ ఇప్పుడు 'బాహుబలి' కి సంబందించిన కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయని.... కాదు కాదు సినిమా పైరసీ బారిన పడిందని... అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో బాహుబలి థియేటర్ లో ప్రదర్శిస్తున్న పిక్స్ కొన్ని వైరల్ అయ్యాయి. మరోపక్క బాహుబలి చిత్ర ప్రదర్శన జరిగిపోయిందని రూమర్.
ఇవన్నీ గమనిస్తున్న 'బాహుబలి' టీమ్ నిర్మాత చేత ఒక క్లారిటీ ఇప్పించారు. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ లో బాహుబలిపై జరుగుతున్నా రూమర్స్ కి చెక్ పెట్టారు. బాహుబలి చిత్రాన్ని దేశ విదేశాల్లో విడుదల చెయ్యడం వలన అక్కడ సెన్సార్ బోర్డు వాళ్లకి బాహుబలిని ప్రదర్శించడం జరిగింది. కేవలం సెన్సార్ బోర్డు వాళ్ళకే ప్రదర్శించామని... ఇంకెక్కడా సినిమా ప్రదర్శన జరగలేదని.... అందులోను సినిమా పైరసీ జరగలేదు... అంటూ పూర్తి క్లారిటిని ఇచ్చి గాసిప్ రాయుళ్ల నోళ్లు మూయించారు బాహుబలి నిర్మాత శోభు.