బాహుబలి ద కంక్లూజన్ విడుదలకు ఒకే ఒక రోజు మిగిలి వుంది. బాహుబలి టికెట్స్ కోసం జనాలు ఎగబడతున్నారు. ఈ రోజు బుధవారం ఐమాక్స్ లో బాహుబలి టికెట్స్ ఓపెన్ చేశారని చెప్పగానే ఉదయం నాలుగు గంటల నుండే లైన్ లో నిలబడి మరీ బాహుబలి టికెట్స్ సంపాదిస్తున్నారు జనాలు. రెండేళ్లుగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అనే సస్పెన్స్ లో కొట్టు మిట్టాడుతున్నారు ప్రేక్షకులు. ఇక ఆ సస్పెన్స్ కి మరొక్క రోజులో తెరదించబోతున్నాడు రాజమౌళి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులే బాహుబలి కోసం ఎదురు చూడడం లేదు.... ప్రతి ఒక్క భాషా ప్రేక్షకుడు బాహుబలి కోసం అంతే ఎదురు చూస్తున్నారు.
ఇక ఇప్పుడు ప్రముఖంగా బాహుబలి టికెట్స్ కోసం బాక్సాఫీస్ యుద్ధం జరుగుతుంది. సామాన్యుల నుండి విఐపిలు వరకు బాహుబలి టికెట్స్ కోసం కొట్టేసుకుంటున్నారు. తాజాగా ఒక కలెక్టర్ గారు బాహుబలి సినిమా కోసం ఏకంగా 500 టికెట్లను బుక్ చేసిన తీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రాపాలి బాహుబలి 2 రిలీజ్ రోజున.. ఫస్ట్ షో కోసం ఏకంగా 500 టికెట్లు బుక్ చేసి ఈ సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదో నిరూపించింది.
ఆమ్రపాలి హన్ముకొండలోని ఏషియన్ శ్రీదేవి థియేటర్లలో ఈ టికెట్స్ బుక్ చేసి చర్చలకు తెరలేపింది. అయితే ఆమె ఆ టికెట్స్ ని తన స్నేహితుల కోసం బుక్ చేసిందా లేకపోతె అధికారుల కోసం బుక్ చేసిందా అనే విషయం మాత్రం బాహుబలి విడుదల అయ్యే మొదటి షో వరకు వెయిట్ చెయ్యాల్సిందే.