ప్రపంచం మొత్తం బాహుబలి ద కంక్లూజన్ విడుదల కోసం ఎర్రెత్తిపోయి ఎదురు చూస్తున్నారు. మరో పక్క బాహుబలి టీమ్ బాహుబలి చిత్రం పబ్లిసిటీని కనివిని ఎరుగని రీతిలో చేపట్టింది. ప్రపంచం మొత్తం 9000 థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడంతో బాహుబలి టీమ్ ప్రమోషన్స్ ని వేగవంతం చెయ్యడమే కాదు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ని దుబాయిలో ముగించేసింది. నిన్న మంగళవారం బాహుబలి టీమ్ రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, నిర్మాత శోభు యార్ల గడ్డ లు దుబాయ్ వెళ్లారు. అక్కడ మూవీ ప్రమోషన్ ని ముగించుకుని ఈ రోజు బుధవారం హైదరాబాద్ కి బయలుదేరిన బాహుబలి టీమ్ కి ఏమిరేట్స్ ఫ్లైట్ లో ఘోర అవమానం జరిగిందని అంటున్నారు.
బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ దుబాయ్ లో బాహుబలి టీమ్ కి జరిగిన అవమానాన్ని తన ట్విట్టర్ లో తెలియజేశాడు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన తాము ఏమిరేట్స్ ఫ్లైట్ లో బయలుదేరామని... గేట్ దగ్గరి ఫ్లైట్ సిబ్బంది కారణం లేకుండా తమని ఇబ్బందులు పాలు చేశారని... తమపట్ల అమర్యాదగా ప్రవర్తించారని ట్వీట్ చేశాడు శోభు. తరచూ ఏమిరేట్స్ ఫ్లైట్స్ లో తాను ప్రయాణిస్తానని..కానీ.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు.
మరి దేశమంతటా బాహుబలికి బ్రహ్మరధం పడుతుంటే ఏమిరేట్స్ ఫ్లైట్ లో మాత్రం బాహుబలి టీమ్ మెంబెర్స్ అవమానాలు పాలు కావల్సి వచ్చింది.