బాహుబలి చిత్రంలో దేవసేన గా మొదటి పార్ట్ లో డీ గ్లామరస్ గా పరిచయమైనా అనుష్క శెట్టి 'బాహుబలి ద కంక్లూజన్' లో ఎంతటి అందంతో దర్శనమిస్తుందో అని ఎదురు చూస్తున్నారు అనుష్క అభిమానాలు. మొదటి పార్ట్ లో నిరాశ పరిచిన అనుష్క రెండో పార్టులో అందచందాలతో మత్తెక్కిన్చేలాగే కనబడుతుంది. మొదటి పార్టులో తమన్నాకి ఇంపార్టెన్స్ ఇచ్చిన జక్కన్న రెండో పార్ట్ మొత్తం అనుష్కనే హైలెట్ చేశాడు. ఇకపోతే అనుష్క వల్ల బాహుబలి షూటింగ్ ఆలస్యం అయ్యిందని... అనుష్క బాగా లావుగా ఉండడంతో గ్రాఫిక్స్ తో రాజమౌళి మాయ చేస్తాడని ఏవో రూమర్స్ వచ్చాయి.
మరి నిజంగానే అనుష్క సైజు 'సైజు జీరో' వల్ల బాగా పెరిగిపోయింది. 'సైజ్ జీరో' చిత్రానికి సైజు పెంచిన అనుష్క దాన్ని కరిగించడానికి అనేక కష్టాలు పడింది. అయితే అనుష్క సైజు లో కొద్దిగా మార్పు వచ్చింది కానీ... ఇంకా లావుగానే కనబడుతుంది. ఈ మధ్యన బాహుబలి ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనుష్క అన్ని చోట్లకి చీరలోనే దర్శనమిస్తుంది. కొద్దిగా ఒళ్ళు చేసిన అనుష్క సినిమాలో ఎలా ఉంటుందో అనే డౌట్ తో ఇప్పటివరకు అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు.
ఇప్పటివరకు బాహుబలి కి సంబందించిన లుక్స్ చాలానే వదిలారు. అందులో అనుష్కని ఏ మాత్రం హైలెట్ చెయ్యకుండా ఈ రోజు బుధవారం వదిలిన లుక్ లో మాత్రం అనుష్కని దేవసేన మహారాణిగా చూపించి చూపరుల మతులు పోగొట్టారు. సింహాసనం మీద కూర్చుని రాజదర్పంతో వెలిగిపోతున్న అనుష్కని చూస్తుంటే ఎవ్వరైనా అదరహో అనాల్సిందే. ఆ హుందాతనం, అందం, అణుకువ చూస్తుంటే 'బాహుబలి ద కంక్లూజన్' లో అనుష్క ని చూసి అందరూ పడిపోవాల్సిందే మరి.