రాశి ఖన్నా 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె మంచి సినిమాలే చేసినా కూడా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. అయితే తాజాగా రాశి ఖన్నా దశ తిగినట్లే కనబడుతుంది. ఇప్పడు తాజాగా టాలీవుడ్ లో ఆమె చేతిలో రెండు సినిమాలు ఉండగా మరో సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు పెద్ద ప్రాజెక్ట్స్ అయిన 'జై లవ కుశ' లో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తుండగా, మరో మూవీ 'టచ్ చేసి చూడు' లో రవితేజతో నటిస్తుంది. ఇక అమ్మడికి ఇప్పుడు మరో ఛాన్స్ వరించిందంట
మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసిందట ఈ భామ. నూతన దర్శకుడు వెంకీ డైరేక్షన్ లో వరుణ్ తేజ్ చేయబోయే కొత్త ప్రేమ కథ చిత్రంలో రాశి ఖన్నా ని వరుణ్ కి జోడిగా ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ముందుగా ఈ చిత్రానికి మెహ్రీన్ పీర్జాదాను హీరోయిన్ గా తీసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మెహ్రీన్ ప్లేస్ లోకి రాశి ఖన్నా వచ్చి చేరిందట. ఇప్పటికే రాశి ఖన్నా మెగా హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్ 'సుప్రీం'లో నటించింది. ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసి మెగా హీరోయిన్ అనిపించుకుంటుంది.