ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రాన్ని ఎన్టీఆర్, అన్నయ్య కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడన్నప్పటి నుండి ఈ చిత్రంపై క్యూరియాసిటీతో పాటే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో 'జై లవ కుశ' మీద చాలా మంది కన్నే పడింది. కొంత మంది బడా నిర్మాతలు ఇప్పటికే నిర్మాత కళ్యాణ్ రామ్ కి భారీ ధర ఆఫర్ చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి.
ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలు కానీ 'జై లవ కుశ' చిత్రానికి అప్పుడే శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయట. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా 'జనతా గ్యారేజ్' చిత్ర శాటిలైట్ హక్కులను చేజిక్కించుకున్న జెమిని టీవీ వారే ఇప్పుడు 'జై లవ కుశ' సాటిలైట్ హక్కులను కూడా దక్కించుకుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 'జై లవ కుశ' శాటిలైట్ రైట్స్14 కోట్ల రూపాయలకు జెమినీ టీవీ కైవశం చేసుకుందట.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ లు నటిస్తుండగా.. 'జనతా గ్యారేజ్' సెంటిమెంట్ ప్రకారం 'జై లవ కుశ'ని 'జనతా గ్యారేజ్' రిలీజ్ డేట్ కె విడుదల చెయ్యాలని ఎన్టీఆర్ టీమ్ ప్లాన్ చేస్తుందట.