రామ్ చరణ్ - సమంత జంటగా సుకుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్ రాజమండ్రి, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ దివ్యంగుడిగా, బెస్తవానిగా నటిస్తున్నాడు. ఇంత వేసవిలో అందులోను మండే ఎండల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఎండలను లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇక హీరోయిన్ సమంత కూడా ఇంత ఎండలో షూటింగ్ లో పాల్గొంటూ కష్టపడుతుంది. అయితే శరవేగంగా జరుపుకుంటున్న సుకుమార్ చిత్ర షూటింగ్ వాయిందా పడిందని అంటున్నారు.
కారణం సమంత కి వడదెబ్బ తగలడమే అంటున్నారు. నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటున్న సమంత కి ఈ అధిక ఎండల వల్ల వడదెబ్బ తగలడంతో షూటింగ్ కి ప్యాకప్ చెప్పాల్సి వచ్చిందట. ఆమె కోలుకుంటే వెంటనే షూటింగ్ మొదలు పెడదామని అనుకున్న చిత్ర యూనిట్ కి సమంత ఇంకా కోలుకోక పోవడంతో ప్రస్తుతానికి షూటింగ్ ని కొద్దిగా వాయిదా వేశారట. అయితే రామ్ చరణ్ కి సమంత కి సంబందించిన సీన్స్ తో ఇక అక్కడి షూటింగ్ పూర్తవుతుందట .ఇక ఇప్పుడే ఇలా ఎండలు మండిపోతుంటే మళ్లీ మే నెలలో సుకుమార్ చిత్రం రెండో షెడ్యూల్ మొదలవ్వబోతుందట.