Advertisementt

ప్రభాస్.. ఆ విషయాన్ని బయట పెట్టాడు..!

Tue 25th Apr 2017 07:36 PM
prabhas,mahesh babu,mahabharatha movie,mohanlal,director sri menone  ప్రభాస్.. ఆ విషయాన్ని బయట పెట్టాడు..!
Prabhas in Mahabharatha..! ప్రభాస్.. ఆ విషయాన్ని బయట పెట్టాడు..!
Advertisement
Ads by CJ

దేశంలో ఒక పక్కన 'బాహుబలి ద కంక్లూజన్' ఫీవర్ మొదలైపోయింది. విడుదలకు సమయం దగ్గరపడే కొద్దీ ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క ఇదే ఇండియాలో 'మహాభారత' గురించి హాట్ హాట్ చర్చ మొదలైంది. దుబాయ్ వ్యక్తి ఒకరు 1000  కోట్ల భారీ బడ్జెట్ తో శ్రీ మీనన్ డైరెక్షన్ లో 'మహాభారత' ని నిర్మిస్తున్నాని చెబుతున్నాడు. దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైపోయింది అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ చిత్రంలో నటించే నటుల గురించి డిస్కార్షన్స్ జోరుగా సాగుతుంది. ఏ పాత్రకు ఎవరైతే బావుంటుందని దానిమీద నెటిజన్లు ఎవరికీ తోచింది వారు చెబుతున్నారు.

ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముని పాత్ర చేస్తున్నట్టు కన్ఫర్మ్ అవగా.. మిగతా కేరెక్టర్స్ పేర్లు రివీల్ అవ్వాల్సివుంది. మరో పక్క మహాభారతంలో మహేష్ బాబు శ్రీ కృష్ణుడు పాత్ర చేయకుండా అర్జునిడి పాత్రగాని చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క బాహుబలితో ప్రపంచవ్యాప్తి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కూడా ఈ 'మహాభారత' లో చెయ్యబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. బాహుబలి అనే అతి పెద్ద ప్రాజెక్ట్ లో భాగస్వామ్యుడైన ప్రభాస్ ఆ చిత్రం కోసం మూడున్నరేళ్లు మరే చిత్రం చెయ్యకుండా వుండిపోయాడు. మళ్లీ ఇప్పుడు ఈ అతి పెద్ద భారీ ప్రాజెక్ట్  'మహాభారత' లో తనకి ఏదైనా క్యారెక్టర్ ఇస్తే నటిస్తాను అనే విషయాన్ని మెల్లగా బయట పెట్టాడు ప్రభాస్.

తనకి అవకాశం రావాలే గాని ఏ క్యారెక్టర్ ఇచ్చినా నటిస్తానని క్లారిటీ ఇచ్చాడు. తనని గనక 'మహాభారత' టీమ్ ఆ మూవీ లో చెయ్యమని సంప్రదిస్తే వెంటనే ఒప్పేసుకుంటానని చెబుతున్నాడు. మరి 200  కోట్ల బడ్జెట్ బాహుబలి కోసం మూడున్నరేళ్లు త్యాగం చేసిన ప్రభాస్ 1000  కోట్ల భారీ బడ్జెట్ 'మహాభారత' కోసం ఇంకెన్నేళ్ళు త్యాగం చెయ్యాల్సి వస్తుందో అని అంటున్నారు.

Prabhas in Mahabharatha..!:

Ever since Mahabharatha was announced as a 1000 Crore magnum opus by a Dubai based businessman Dr BR Shetty starring Mohan Lal in Bhima’s role, speculations went rife on other Telugu, Tamil stars to be a part of this prestigious project. While the gossip of Mahesh Babu to play Lord Krishna or Arjuna role is highly promoted in Indian film circles, Prabhas Fans in Baahubali hangover are also expecting their Rebel Star to be in the prime Mahabharatha league.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ