ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి మ్యానియాతో ఉన్నారు జనాలు. సినిమా విడుదలకు చాలా తక్కువ సమయమే ఉండంతో... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే దాని మీదే అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు. ఈ సినిమాపై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలు బాహుబలి విడుదలవ్వక ముందే బాహుబలి కథ లీకైందంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం కూడా చెప్పేస్తున్నారు.
బాహుబలి ద కంక్లూజన్ లో బాహుబలి, ప్రభాస్ గిరిజన యువతి దేవసేన, అనుష్కని ప్రేమిస్తాడు. ఇక రాజ్యం కన్నా ప్రేమే గొప్పదని భల్లాల దేవుడు, రానా... బాహుబలికి రాంగ్ గైడెన్స్ ఇస్తాడు. బాహుబలి కూడా దేవసేనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని అక్కడే అడవుల్లో ఉండిపోతాడు. అయితే బాహుబలి గిరిజనులతో కలిసి మాహిష్మతి సామ్రాజ్యంపై పడి దోచుకుంటున్నాడని భల్లాల దేవుడు, రాజమాత రమ్యకృష్ణ కు లేనిపోనివి నూరి పోస్తాడు. రాజమాత కూడా భల్లాల దేవుని మాటలు నమ్మి బాహుబలిని బందించి అయినా లేక అంతమొందించి అయినా రమ్మనిసైన్యాలను ఆదేశిస్తుంది రమ్యకృష్ణ. ఇదే అదను కోసం ఎదురు చూస్తున్న భల్లాలదేవుడు, బాహుబలిపై యుద్దానికి వెళ్లగా అక్కడ యుద్ధంలో బాహుబలిని చూసిన సైనికులు కొంతమంది బాహుబలి మీద ఇష్టంతో బాహుబలి వైపుకు వెళ్ళిపోతారు. ఇక సైన్యం రెండు వర్గాలుగా చీలిపోయి యుద్ధంలో పాల్గొంటుంది. భల్లాల దేవుడు ఓడిపోయే పరిస్థితుల్లో రాజమాత, బాహుబలిని అంతమొందించమని మాహిష్మతి రాజ్యానికి విశ్వాస పాత్రుడు అయిన కట్టప్పను ఆదేశిస్తుంది. ఇక కట్టప్ప, బాహుబలిని చంపేస్తాడు. దానితో భల్లాలదేవుడు, దేవసేనని కూడా అంతమొందించి శత్రు శేషం లేకుండా చేయాలనుకుంటాడు. కానీ దేవసేన తప్పించుకుని రాజమాతను కలిసి జరిగిన విషయాలు చెబుతుంది.
అదంతా విన్న రాజమాత పశ్చాత్తాపంతో బాహుబలి బిడ్డను తీసుకుని భల్లాలదేవుడి, బిజ్జలదేవుడి కంట పడకుండా తప్పించుకుని పారిపోయి బిడ్డతో సహా నదిలో కొట్టుకుపోతుంది. ఆ బిడ్డ అడవిలో పనిచేసుకునే కొంతమందికి దొరుకుతుంది. అయితే రాజమాత, బిడ్డ కూడా నదిలో కొట్టుకుపోయారని సైన్యం భళ్లాలదేవుడితో చెప్తారు. అప్పటినుండి ఏకచత్రాధిపత్యంగా మాహిష్మతిని ఏలుతూ కట్టప్పని విస్వాసబంధంలో బిగించి... దేవసేనని బందించి రాజ్యమేలుతుంటాడు భల్లాలదేవుడు. మరో పక్క గిరిజనులు తమ బిడ్డ దేవసేనని రక్షించుకోవడానికి మాహిష్మతిపై యుద్ధం చేస్తుంటారు. అయితే వారు రెండో బాహుబలి శివునితో మాహిష్మతి రాజ్యంపై దండెత్తి భల్లాల దేవుణ్ణి ఓడించి బాహుబలి మాహిష్మతికి రాజుని చేస్తారు. దేవసేన రాజమాతగా రమ్యకృష్ణ ఆత్మకు ఎలా శాంతి కలగజేసిందో అనేదే బాహుబలి కథగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరి ఇదిగనక రాజమౌళి చదివితే ఇన్ని ఏళ్ళు కష్టపడి తీసిన బాహుబలి థియేటర్ లోకి రాకముందే ఇలా కథ బయటికి వచ్చేసిందని తెగ ఫీలైపోతాడేమో? అలాగే పైరసీని అరికట్టడానికి రాజమౌళి గతంలో బాహుబలి అప్పుడు కొన్ని ప్లాన్స్ చేశాడు. ఆ పైరసీ మాట దేవుడెరుగు ఇప్పుడు స్టోరీ లీకైపోయిందని అంటున్నారు కొంతమంది.