తెలుగులో మంచి చిత్రాలను, సినిమా ద్వారా ఏదైనా చెప్పాలని తాపత్రయపడే దర్శకులను, ఫీల్‌గుడ్ మూవీ దర్శకులను ప్రేక్షకులు, నిర్మాతలు ఎవ్వరూ పట్టించుకోరు. మరి ఇది ఇండస్ట్రీ తప్పా లేక ప్రేక్షకుల తప్పా అనేది అర్ధం కాని ఓ బ్రహ్మపదార్ధం. ఇటీవలి దర్శకుల విషయానికి వస్తే నీలకంఠ, చంద్రసిద్దార్డ్, మదన్, 'మీ శ్రేయోభిలాషి' ఈశ్వర్‌రెడ్డి నుంచి క్రాంతి మాధవ్ వరకు పెద్దగా బిజీగా ఉండరు. ఇక చంద్రసిద్దార్ధ్ విషయానికి వస్తే అన్నం ఉడికిందా లేదా? అనేది ఒక మెతుకును పట్టుకుంటేనే తెలుస్తుంది.
చంద్రసిద్దార్ద్ 'ఆ..నలుగురు' చూస్తే ఆయన టాలెంట్ అర్ధమవుతోంది. ఆ తర్వాత 'మధుమాసం, ఏమో గుర్రం ఎగరావచ్చు'తో గాడితప్పాడు. ప్రస్తుతం ఈయన మరో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నేళ్ల గ్యాప్‌లో ఓ మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడట. రెండు పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో రావురమేష్, జబర్దస్త్ ఆదిలు నటించనున్నారని సమాచారం. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రమైనా ఈ ఫీల్‌గుడ్ డైరెక్టర్‌కి మంచి కమర్షియల్ హిట్‌ని అందిస్తుందేమో చూడాలి....!