సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ కి బోలెడంత చోటు. అందుకే సినిమా మొదలు పెట్టె ముహూర్తం షాట్ నుండి విడుదలయ్యే సమయం వరకు నిర్మాతలు అంతా కేర్ తీసుకుంటారు. అంతేకాకుండా ఒక హీరో చిత్రం ఒక డేట్ లో సూపర్ హిట్ అయితే మళ్ళీ అదే డేట్ కి తన తదుపరి చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడా సెంటిమెంట్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ'ను ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన 'జనతా గ్యారేజ్' విడుదల తేదీకే విడుదల చెయ్యాలని ఎన్టీఆర్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారట.
గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన 'జనతా గ్యారేజ్' చిత్రం ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇచ్చింది. ఇక ఆ చిత్రంతో ఎన్టీఆర్ రేంజ్ ఎన్నో రేట్లు పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ 'జై లవ కుశ'ని కూడా ఆ సెప్టెంబర్ మంత్ లోనే రిలీజ్ డేట్ ప్రకటించాలని భావిస్తున్నారట. అయితే ముందు 'జై లవ కుశ'ని ఆగష్టు లోనే విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సెంటిమెంట్ ని ఫాలో అవుతూ సెప్టెంబర్ 1 న విడుదల చెయ్యాలని ఫిక్స్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్న ఈ 'జై లవ కుశ' చిత్రంలో హీరోయిన్స్ గా రాశి ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ లు నటిస్తున్నారు. మరో టాప్ హీరోయిన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటిస్తుందని ప్రచారం ఉండనే వుంది.