రాజకీయాలలోకి రావడానికి మనదేశంలో ఏ అర్హతలు లేవు. ఎవరైన వచ్చి ప్రజాసేవ కోసమే వచ్చామంటారు. దేశంలోని నేటి ఎంపీలు, ఎమ్మెల్యేలలో కేవలం రాజకీయాలనే ఫుల్‌టైంగా మార్చుకున్న వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. తమ వ్యాపారాలు, కాంట్రాక్ట్‌లు, తమ వ్యక్తిగత వృత్తుల వంటి సినిమాలు వంటివి చేస్తూ రాజకీయాలను పార్ట్‌టైంగా భావిస్తున్నారు. కానీ ఎంత రెండు, మూడూ పడవల మీద ప్రయాణం చేయగలిగిన వారైనా, సవ్యసాచులైనా ఇది ప్రమాదకరం.
పాతతరంలో తమ ఇతర జ్ఞపకాలన్నింటిని పక్కనపెట్టి తమ ఆస్తులను కూడా కరిగించుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇక సినిమాలలో చేస్తూనే రాజకీయాలలోకి వచ్చిన వారు త్వరగానే కనుమరుగవుతున్నారు. వన్ ఎలక్షన్ వండర్‌గా మిగులుతున్నారు. గతంలో సత్యనారాయణ, కోటల నుంచి రాజశేఖర్, జీవితా, పోసాని వంటి వారు కూడా దెబ్బతిన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ, అమితాబ్‌ల నుంచి తాజాగా బాలకృష్ణ వరకు ఇదే సమస్య వెంటాడుతోంది. తాజాగా బాలయ్య తన హిందూపురం నియోజకవర్గానికి, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని చివరకు దున్నపోతులతో ఊరేగింపు నిర్వహించారు.
ఇక తాజాగా సుమన్ కూడా వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా పార్టీలో చేరడమో.. తన భావాలకుమద్దతు ఉన్నవారికి మద్దతు ఇవ్వడమో చేస్తానన్నాడు. స్వయాన స్వర్గీయ రామానాయుడు ఎంపీగా గెలిచి, తన సొంతనిధులతో తన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది చేశారు. కానీ ఆయన్ను తదుపరి ఎన్నికల్లో ఓటమి వెక్కించింది. దాంతో ఆయన రాజకీయాలపైనే విరక్తి పెంచుకున్నాడు. కాబట్టి సుమన్, శివాజీ వంటి ఫేడవుట్ అయిన వారు ఫుల్‌టైం రాజకీయాలలోకి వస్తే మంచిదే గానీ పార్ట్‌టైం పొలిటీషియన్స్‌గా మిగలరాదు.