కళలకు కుల మతాలు, ఆర్ధికస్తోమతలు.. వంటివి కూడా వివక్షతను చూపుతున్నాయి. ఒకప్పుడు ఎవరు బాగా నటిస్తే, ఎవరు మంచి చిత్రాలను నిర్మిస్తే, ఎవరు బాగా దర్శకత్వం వహిస్తే వారికి పట్టం కట్టేవారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఉదాహరణకు ఓ హీరో లేదా దర్శకుడు పరిచమై రాణిస్తే వెంటనే అతని కులం, మతాలు బాగా వ్యాపిస్తున్నాయి. చాలా మంది ఇదే పనిలో ఉంటారు. మీడియా పెరిగిన నేపథ్యంలో, సోషల్ మీడియా హవా చేస్తున్నప్పుడు ఇది సాధారణమే.
నిజానికి కళలకు కుల మతాల భేదాలు ఉండి ఉంటే ఒక ఎన్టీఆర్, నాగేశ్వరరావు నుంచి చిరంజీవి, రవితేజ వరకు ఎవ్వరూ ఎదగలేకపోయారు. ఉదాహరణకు తమిళంలో రెహ్మాన్‌గా ఫేమస్ అయిన నటుడు తెలుగులోకి వచ్చేసరికి తన సన్నిహితుల మాట విని రఘుగా పేరు మార్చుకున్నాడు. ఇక నేడు ఆర్దిక నేపధ్యం కూడా ప్రధానమైపోయింది. దీంతోనే చాలామంది తమ కులాలు, మతాలు, ఆర్థిక స్తోమతలను దాస్తున్నారు. వారిలో బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు కూడా చేరిపోయాడు.
ఆయన ఒకప్పుడు తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని, తాను విదేశాలలో బాగా సంపాదించి వచ్చానని చెప్పాడు. కానీ ఈ విషయం నిజం కాదని ఎప్పటి నుంచో చాలామందికి తెలుసు. ఒక ఆయన తన అసలు పేరుతో పాటు తన ఊరిని, తన జీవనశైలిని, ఆర్టీసీ బస్సులలో ఎవ్వరూ గుర్తుపట్టకుండా కర్చీఫ్ పెట్టుకుని షూటింగ్‌లకు వచ్చిన విషయాన్ని, తాను ఇప్పటికీ తన సొంత ఊరులో సైకిల్‌పై తిరిగే విషయాన్ని బయటపెట్టి అబద్దం చెప్పినందుకు క్షమించమని కోరాడు.
ఇక ఓ చెత్త హీరోతో ఓ చెత్త సినిమా తేయడం కోసమే తాను 'హృదయకాలేయం'లో నటించానని చెప్పాడు. ఇక ఆయన చిన్నహీరోనే కావచ్చు. కానీ మనసులో మాత్రం ఆయన నిజంగా ఓ స్టార్. తనకున్న ఆర్ధికపరిస్థుతుల్లో ఆయన హుదుహుద్ తుఫాను బాధితులకు తనవంతు సాయం చేశాడు. తెలంగాణ వాడైనప్పటికీ వైజాగ్‌లో జరిగిన ప్రత్యేకహోదా సభకు వచ్చి అరెస్ట్ అయ్యాడు...దటీజ్ సంపూ...!